మహిళా సంఘాలకు రుణాల పంపిణీ

May 29, 2026 - 22:19
 0  0
మహిళా సంఘాలకు  రుణాల పంపిణీ

 తిరుమలగిరి  30 మే 2026 తెలంగాణ వార్త రిపోర్టర్:

ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా తిరుమలగిరి మున్సిపాలిటీ పరిధిలో 9 స్వయం సహాయక సంఘాల మహిళలకు రూ 1.10 కోట్ల బ్యాంకు రుణాల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు మున్సిపల్ కమిషనర్ వెంకన్న తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళల ఆర్థిక అభివృద్ధి మరియు స్వయం ఉపాధి అవకాశాల పెంపుదలకు ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. సంఘాల మహిళలు బ్యాంకు రుణాలను సద్వినియోగం చేసుకొని చిన్న వ్యాపారాలు, ఉపాధి కార్యక్రమాలు చేపట్టి ఆర్థికంగా ఎదగాలని సూచించారు.ప్రభుత్వం మహిళా సాధికారత కోసం అమలు చేస్తున్న పథకాలను ప్రతి మహిళ ఉపయోగించుకోవాలని, సంఘాల బలోపేతమే గ్రామీణ మరియు పట్టణ అభివృద్ధికి దోహదపడుతుందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో బ్యాంకు అధికారులు,  వైస్ చైర్ పర్సన్  మరియు కమిషనర్ , రిసోర్స్ పర్సన్లు, మున్సిపల్ అధికారులు, సంఘాల సభ్యులు, ప్రజా ప్రతినిధులు మరియు తదితరులు పాల్గొన్నారు.

జేరిపోతుల రాంకుమార్ తిరుమలగిరి విలేకరి మరియు తుంగతుర్తి నియోజకవర్గం ఇన్చార్జి