మహిళా వికలాంగులు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలి
భువనగిరి 29 మార్చి 2026 తెలంగాణవార్త రిపోర్టర్:– మహిళా వికలాంగుల పట్ల సమాజంలో కొనసాగుతున్న అసమానతలను దైర్యంగా ఎదుర్కొని,ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని ఎల్ఐసి సంస్థ కమ్యూనిటీ కోఆర్డినేటర్ సుబ్రహ్మణ్యం పిలుపునిచ్చారు.శనివారం రోజు వికలాంగుల హక్కుల జాతీయ వేదిక (ఎన్.పి.ఆర్.డి) తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మహిళా వికలాంగుల ఉత్సవాల ఎల్ఐసి తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించడం జరిగింది. వివిధ రంగాల్లో సేవాలందిస్తున్న 10 మంది మహిళా వికలాంగులకు స్ఫూర్తి అవార్డ్స్ ప్రధానం చేయడం జరిగింది.మహిళా వికలాంగులతో ఆట పాట, మాట, సాంస్కృతిక ఉత్సవాలు నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమనికి ముఖ్య అతిథిగా హాజరైన సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ..సమాజంలో వికలాంగుల పట్ల కొనసాగుతున్న వివక్షత,అసమానతలను అదిగమించాలంటే చదువు ఒక్కటే మార్గమని తెలిపారు.చదువు కోవడం ద్వారానే సమాజంలో గుర్తింపు,గౌరవం వస్తుందని అన్నారు.వికలాంగులలో శక్తి సామర్థ్యాలు ఉన్నాయని వాటిని బయటకు తీయాల్సిన అవసరం ఉందని అన్నారు.విద్యా,ఉద్యోగాల్లో వికలాంగులకు ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.ఎల్ఐసి సంస్థ వికలాంగులతో పాటు సకలాంగుల కోసం అనేక భీమా సౌకర్యాలు కల్పిస్తుందని అన్నారు.
జీవిత భీమా చేసుకోవడం ద్వారా ధీమాగా జీవించవచ్చునని అన్నారు.ఐద్వా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు టి జ్యోతి మాట్లాడుతూ..వికలాంగుల హక్కుల పరిరక్షణ కోసం ప్రభుత్వాలు కృషి చేయాలని అన్నారు.మహిళా వికలాంగుల పట్ల కొనసాగుతున్న లైంగిక వేధింపులు,అత్యాచారాలు, వివక్షతను అరికట్టెందుకు ప్రభుత్వాలు ప్రత్యేక చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు.ప్రభుత్వాలు సకలాంగులైన మహిళలకు అమలు చేస్తున్న సంక్షేమ పథకాల్లో మహిళా వికలాంగులకు ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు.మహిళలకు ప్రతి నెల 2500 రూపాయలు ఇస్తామని ప్రభుత్వం చెప్పిన ఎందుకు అమలు చేయడం లేదని అన్నారు.
మహిళా వికలాంగులలో లైంగిక దుర్వినియోగం సకలాంగుల మహిళలతో పోల్చితే రెట్టింపు ఉందని ఉన్నతి సంస్థ పేర్కొన్న వాటిని నీవరించడానికి ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని అన్నారు. ఎన్.పి.ఆర్.డిరాష్ట్ర ప్రధాన కార్యదర్శి యం అడివయ్య మాట్లాడుతూ వికలాంగుల సంక్షేమం పట్ల ప్రభుత్వాలు చిన్నచూపు చూస్తున్నాయని అన్నారు.
చట్టాలు కల్పించిన హక్కులు అమలుకు నోచుకోవడం లేదని అన్నారు.హక్కుల కోసం పోరాడుతున్న ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని అన్నారు.పెన్షన్ పెంచుతామని చెప్పిన ప్రభుత్వం పెన్షన్ పెంచడం లేదని తెలిపారు.కొత్త పెన్షన్స్ మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.మహిళా శక్తి పథకంలో మహిళా వికలాంగులకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని డిమాండ్ చేశారు.ప్రముఖ వైద్యులు డాక్టర్" నళిని మాట్లాడుతూ..మహిళా వికలాంగులలో ఆరోగ్య సమస్యలు పెరుగుతున్నాయని అన్నారు.ఆరోగ్య జాగ్రత్తలు తీసుకోవడంలో మహిళా వికలాంగులకు అవగాహనా ఉండడం లేదని అన్నారు. అనారోగ్యంతో ఆందోళనకు గురికాకుండా పట్టుదలతో ముందుకు వెళ్లాలని అన్నారు.మహిళా వికలాంగులలో ఆరోగ్య సమస్యలపై అవగాహన కల్పించేందుకు ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని అన్నారు.
ఈ కార్యక్రమం సంఘం రాష్ట్ర అధ్యక్షులు కె వెంకట్,కోశాధికారి ఆర్ వెంకటేష్, ఉపాధ్యక్షులు కె యశోద, అరిఫా, స్వామి, ఉపేందర్, రాష్ట్ర కమిటీ సభ్యులు శశికల,సాయి గీత, లలిత, భాగ్యలక్ష్మి, లలిత, రాధమ్మ, షాహిన్ బేగం,భాగయ్య, చంద్రమోహన్, భుజంగారెడ్డి, మేరీ, మల్లెపు నరసింహ, చెన్నయ్య, రాజు, బంగారయ్య తదితరులు పాల్గొన్నారు.