మహిళా ఎస్‌ఐపై దాడి చేసిన వైసీపీ నేతలపై కేసులు నమోదు 

Aug 1, 2026 - 21:57
 0  1
మహిళా ఎస్‌ఐపై దాడి చేసిన వైసీపీ నేతలపై కేసులు నమోదు 

జిల్లాలో వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి పర్యటన సందర్భంగా చోటుచేసుకున్న ఉద్రిక్తతలపై పోలీసులు చర్యలు చేపట్టారు. విధి నిర్వహణలో ఉన్న మహిళా ఎస్‌ఐ ప్రవళిక‌పై దాడి జరిగిన ఘటనకు సంబంధించి ఆమదాలవలస వైసీపీ ఇన్‌చార్జ్ చింతాడ రవికుమార్‌ను ఏ-1గా పేర్కొంటూ.. మొత్తం 21 మందిపై కేసులు నమోదు చేశారు. ఘటన సమయంలో విధుల్లో ఉన్న పోలీసు సిబ్బంది ఫిర్యాదు, అందుబాటులో ఉన్న ప్రాథమిక ఆధారాల మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. 

ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఫుటేజ్, ఇతర సాంకేతిక ఆధారాలను పరిశీలిస్తూ పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. ఘటనలో పాల్గొన్న వారి పాత్రను గుర్తించేందుకు వీడియోలు, సీసీటీవీ దృశ్యాలను విశ్లేషిస్తున్నట్లు సమాచారం. దర్యాప్తులో లభించే ఆధారాల ప్రకారం చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు పేర్కొన్నారు..

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333