మన్య సీమ పరిరక్షణ సమితి గ్రామ కమిటీ ఎన్నిక

Feb 22, 2026 - 19:41
 0  1
మన్య సీమ పరిరక్షణ సమితి గ్రామ కమిటీ ఎన్నిక

మన్య సీమ పరిరక్షణ సమితి గ్రామ కమిటీ ఎన్నిక 

 * మండల ఇన్చార్జిగా కురుసం కృష్ణమూర్తి నియామకం

 వాజేడు ఫిబ్రవరి 22 తెలంగాణ వార్త

 ములుగు జిల్లా వాజేడు మండల పరిధి పేరూరు గ్రామపంచాయతీలో మన్య సీమ పరిరక్షణ సమితి డోలు దెబ్బ రాష్ట్ర అధ్యక్షులు గొప్ప వీరయ్య ఆధ్వర్యంలో పేరూరు గ్రామ కమిటీని ఎన్నుకోవడం జరిగింది. గ్రామ అధ్యక్షులుగా కోరం గోపాలకృష్ణ, ఉపాధ్యక్షులుగా తల్లడి శ్రీకాంత్, కార్యదర్శులుగా ఎంజా శ్రీనివాస్,కురుసం ప్రకాష్ తొర్రెం సాగర్, శ్రీ వేణు, లక్ష్మీనారాయణ లను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. అదేవిధంగా వాజేడు మండల మన్య సీమ పరిరక్షణ సమితి ఇన్చార్జిగా కురుసం కృష్ణమూర్తిని నియమించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా అధ్యక్షురాలు సోలం సౌమ్య, జిల్లా నాయకులు తాటి నాగరాజు,మండల నాయకులు కురుసం ప్రసాదు, ఎంజా అనిల్ కుమార్, కురుసం రాంబాబు, సాయి తదితరులు పాల్గొన్నారు.

Alli Prashanth kumar భద్రాద్రి కొత్తగూడెం ములుగు జిల్లా స్టాఫ్ రిపోర్టర్