మనాయకుంట మూసివాగు పునర్జీవం సభకు పోటెత్తిన జనం
అడ్డగూడూరు 27 అక్టోబర్ 2024 తెలంగాణవార్త రిపోర్టర్:- యాదాద్రి భువనగిరి జిల్లా తుంగతుర్తి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని అడ్డగూడూరు మండలం మానాయకుంట గ్రామంలో నిర్వహించిన తుంగతుర్తి నియోజకవర్గ స్థాయి మూసి రైతుల ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామేలు,నకిరేకల్ శాసనసభ్యులు వేముల వీరేశం గార్లు హాజరయ్యారు.ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ..తెలంగాణ ప్రజలకు మంచి చేయాలి మురికి కూపంలో బతుకుతున్నటువంటి ప్రజలకు దారి చూపాలి అన్న ఆలోచనతోటి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిష్టత్మాకంగా తీసుకున్నటువంటి కార్యక్రమం మూసి ప్రక్షాళన పేద ప్రజల సంక్షేమం గురించి పట్టించుకోకుండా ప్రతిపక్ష పార్టీలు కేవలం ప్రభుత్వాన్ని బదునామ్ చేయడం లక్ష్యంగా మాట్లాడుతున్నారు.ప్రపంచవ్యాప్తంగా గుర్తుండే విధంగా ఒక ఆధునిక సిటీగా హైదరాబాద్ ని తీర్చి దిద్దుతుంటే దరిద్రపు ఆలోచన తో విష ప్రచారం చేస్తున్నారు.కమిషన్ లు తినే అలవాటు మీది, మాకు లేదు కమిషన్ లకు అలవాటు పడ్డ మీకు నిద్ర పడుతలేదు.అవుసరం అయితే అసెంబ్లీ ప్రత్యేక సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుంటాం మంచి పని చేసేపుడు మంచి మాట్లాడాలి కాని చిల్లర మాటలు చిల్లర చేష్టలు చేయకండి
హైదరాబాద్ కి బెంగళూరు చెన్నై నగరాల పరిస్థితి రావద్దు అని సీఎం రేవంత్ రెడ్డి గారు ముందు చూపుతో చేస్తుంటే సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు.చేస్తే ప్రజలు నమ్మరు
మూసి నది మీద ఎంతో మంది ప్రజలు, రైతులు ఆధారపడి ఉన్నారు.కాని ఆ కాలుష్యం వల్ల పండించే పంట అమూకునే పరిస్థితి లేదు సమస్యలు పరిష్కారం దిశగా మా ముఖ్యమంత్రి ముందుకు వెళుతున్నారు..పదేండ్ల లో వాళ్ళు చేయలేనిది మేము చేస్తున్నాం కాబట్టి వాళ్ళు ఓర్వలేక పోతున్నారు.ప్రపంచంతో పోటీ పడే నగరంగా హైదరాబాద్ ను తీర్చిదిద్దుతాం.ఇది సుందరీకరణ కోసం కాదు.. ఇది మూసీ పునరుజ్జీవనం కోసంమూసీ మురికి నుంచి ప్రజలను కాపాడాలనేదే మా ప్రభుత్వ చేస్తున్న ప్రయత్నం..మూసి ప్రక్షాళన చేసి గోదావరి నీళ్లు తెచ్చి మూసిని సస్య శ్యామలం చేస్తాం హైదరాబాద్ మురికి, కంపెనీ వ్యర్థలాతో మూసి కలుషితం అవుతుంది.దీని వల్ల తరాతరాలు ఇబ్బంది ఎదురుకుంటారు.ఫార్మ్ హౌస్ లో పండుకొని కాళేశ్వరం కట్టిండు కెసిఆర్ హైదరాబాద్ నగరాన్ని ఇస్తాంబల్,న్యూయార్క్ లండన్ చేస్తా అన్నాడు ఇంట్ల పండుకుంటే అయితదా బీజేపీ నాయకులు కేంద్ర మంత్రులు బండి సంజయ్, కిషన్ రెడ్డి, ఈటల రాజేందర్ గారు మాట్లాడుతారు ప్రధాని మోడీ సభర్మతి నది ని ప్రక్షాళన చేస్తే మంచిది.. రేవంత్ రెడ్డి మూసి ని ప్రక్షాళన చేస్తే అడ్డుపాడుతురు.
ప్రజల సంక్షేమం మీకు పట్టవు... రైతులను కాపాడడం కోసం దీపావళి తర్వాత నకిరేకల్ లో, చివరగా ఇబ్రహీంపట్నంలో లక్ష మందితో సభలు పెడుతాం
సోషల్ మీడియా లో వచ్చే తప్పుడు ప్రచారం నమ్మకండి ప్రజలారా..ఇటువంటి దుర్భరమైన పరిస్థితిలో ఉన్న మూసీ నదిని ప్రక్షాళన చేసి నాటి పరిస్థితి తెచ్చుకుందాం భావితరాలకు రక్షణగా ఉందాం... కాపాడుకుందాం..కాబట్టి మీ రైతులందరికీ విన్నపం చేస్తున్న మూసి ప్రక్షాళన చేయాలంటే మీ సపోర్ట్ అవుసరం ఉంది పరివాహక రైతులందరూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి మూసి నది ప్రక్షాళనకు మద్దతు ఇవ్వాలని కోరారు.ఈ కార్యక్రమం లో కాసోజు శంకరమ్మ, సీనియర్ నాయకులు జ్ఞాన సుందర్, మండల పార్టీ అధ్యక్షులు పోలేబోయిన లింగయ్య,శాలిగౌరారం అధ్యక్షులు సమరం రెడ్డి, మోత్కూర్ మండలం పార్టీ అధ్యక్షులు వంగాల సత్యనారాయణ,అడ్వాకెట్ యుగంధర్, ముఖ్య నాయకులు. మహిళా కాంగ్రెస్ నాయకురాలు పద్మ, రైతులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.