మధ్యాహ్నం భోజనంలో నిత్యం పురుగుల అన్నం దర్శనం
ఎవరికి చెప్పుకోవాలనో దిక్కుతోచని స్థితిలో - అర్దాకలితో విద్యార్థుల చదువులు
జిల్లా విద్యాధికారిణికి కంప్లైంట్ చేసిన జమ్మిచేడు కార్తీక్,పిడి ఎస్ యు జిల్లా కార్యదర్శి వెంకటేష్
జోగులాంబ గద్వాల 23 ఫిబ్రవరి 2026 తెలంగాణవార్త ప్రతినిధి.:-
మండలం తక్కశిల గ్రామ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు నిత్యం పురుగుల అన్నమే దర్శనమిస్తున్న సంఘటన కలకలంరేపుతుంది.దీనిపై సోమవారం జిల్లా విద్యాశాఖ అధికారినికి జమ్మిచేడు కార్తీక్,పిడి ఎస్ యు జిల్లా కార్యదర్శి వెంకటేష్ కలిసి కంప్లైంట్ చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ...ఉండవెల్లి మండలం లో నిత్యం పాఠశాలలను పర్యవేక్షించాల్సిన మండల విద్యాశాఖ అధికారి పట్టించుకోకపోవడం దారుణమని అన్నారు.అందుకు బాధ్యులైన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల హెడ్మాస్టర్ పై చర్యతీసుకొని విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించేందుకు తమ వంతుగా సహకారం అందించాలని కోరారు.