మధ్యవర్తులను ఆశ్రయించొద్దు....

Sep 5, 2026 - 22:12
Sep 5, 2026 - 22:25
 0  3
మధ్యవర్తులను ఆశ్రయించొద్దు....

మున్సిపల్ సేవలన్నీ ఆన్‌లైన్‌లోనే.. ఆర్థిక లావాదేవీలపై నేరుగా ఫిర్యాదు చేయండి: కమిషనర్ హన్మంత రెడ్డి....

సూర్యాపేట, 06 సెప్టెంబర్ 2026 తెలంగాణవార్త రిపోర్టర్:- మున్సిపాలిటీ ద్వారా అందించే వివిధ సేవలు పూర్తిగా ఆన్‌లైన్‌ ప్రక్రియలోనే, నిబంధనల ప్రకారం జరుగుతున్నందున ప్రజలు ఎలాంటి మధ్యవర్తులను ఆశ్రయించవద్దని సూర్యాపేట మున్సిపల్ కమిషనర్ హన్మంత రెడ్డి సూచించారు. భవన నిర్మాణ అనుమతులు, ఎల్‌ఆర్‌ఎస్‌ ప్రొసీడింగ్స్‌ జారీ, ఇంటి నంబర్ల మంజూరు, జనన ధ్రువీకరణ పత్రాల జారీ తదితర సేవలకు సంబంధించి నేరుగా మున్సిపల్ కార్యాలయ అధికారిక ప్రక్రియను మాత్రమే అనుసరించాలని ఆయన కోరారు. మున్సిపాలిటీ నుంచి జారీ చేసే భవన నిర్మాణ అనుమతులు, ఎల్‌ఆర్‌ఎస్‌ ప్రొసీడింగ్స్‌, ఇంటి నంబర్లు, జననా -మరణ సర్టిఫికెట్లు తదితర సేవలన్నీ నిర్దేశిత నియమ నిబంధనల మేరకు ఆన్‌లైన్‌ విధానంలోనే మంజూరు చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ సేవలు ఇప్పిస్తామంటూ ఎవరైనా మధ్యవర్తులు, దళారులను ఆశ్రయించవద్దని స్పష్టం చేశారు.మున్సిపల్‌ సిబ్బంది ఎవరైనా సేవల కోసం డబ్బులు అడిగినా, ఇతర ఆర్థిక లావాదేవీలకు పాల్పడాలని కోరినా వెంటనే తన దృష్టికి తీసుకొని వొస్తే వారి పై చట్ట పరమైన చర్యలు తీసుకోవడం జరుగునని   కమిషనర్‌ హన్మంత రెడ్డి సూచించారు. ప్రజలకు పారదర్శకంగా, నిబంధనల ప్రకారం మున్సిపల్‌ సేవలు అందించడమే లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333