మద్యానికి బానిసై ఎలకల మందు తాగి వ్యక్తి మృతి
తెలంగాణ వార్త మాడుగులపల్లి మార్చి 12 : మాడుగుల పల్లి మండలం చిరుమర్తి గ్రామానికి చెందిన కొండ శ్రీను, తండ్రి బక్కయ్య, వయసు 35 సంవత్సరాలు గత కొంతకాలంగా తాగుడుకు బానిసై తేదీ 10.2.2025 మధ్యాహ్న సమయంలో ఇంటి దగ్గర ఎవరు లేనిది చూసి తన ఇంట్లో ఎలకల మందు తాగి ఆత్మహత్య చేసుకోగా రాత్రి 8 గంటలకు కూలి పని నుంచి తిరిగి వచ్చిన తన భార్య రాజేశ్వరితో, ఎలకల మందు తాగినానని చెప్పడంతో వెంటనే అతనిని చికిత్స నిమిత్తము ముందుగా ఏరియా ఆసుపత్రి మిర్యాలగూడ నందు తరలించగా ప్రథమ చికిత్స అనంతరం అదేరోజు రాత్రి నల్గొండ ప్రభుత్వాసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతుడు కొండా శ్రీను ఈరోజు ఉదయం 7:15 గంటలకు చనిపోయినట్లు తన భార్య కొండ రాజేశ్వరి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్టు మాడుగులపల్లి ఎస్సై ఎస్ కృష్ణయ్య గారు తెలిపారు.