మద్యపానం నిషేధిద్దాం.. ఆజింపేట గ్రామ సర్పంచ్ ఆధ్వర్యంలో గ్రామ సభ

Aug 27, 2026 - 20:13
 0  4

అడ్డగూడూరు 27 ఆగస్టు 2026 తెలంగాణవార్త రిపోర్టర్:- మద్య నిషేధంపై కీలక నిర్ణయం  సెప్టెంబర్ 10 నుంచి సంపూర్ణ మద్య నిషేధం ఆజింపేట గ్రామ ప్రజల ఆరోగ్యం,కుటుంబాల సంక్షేమం,యువత భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని గురువారం రోజు గ్రామసభ నిర్వహించి,సెప్టెంబర్ 10వ తేదీ నుంచి గ్రామంలో సంపూర్ణ మద్య నిషేధం అమలు చేయాలని నిర్ణయించడం జరిగింది.మద్యం అమ్మే వారికి రూ.1లక్షజరిమానా,సమాచారం అందించిన వారికి రూ.50వేల బహుమతి అందించాలని గ్రామ సభలో నిర్ణయించారు.ఈ కార్య క్రమంలో ఆజింపేట గ్రామ సర్పంచ్ కన్నెబోయిన లింగస్వామి యాదవ్ తో పాటు ఉపసర్పంచ్ పోగుల మహేష్ గౌడ్,2వ వార్డు సభ్యురాలు నిమ్మల ఐలమ్మ,3వ వార్డు సభ్యురాలు కన్నెబోయిన రేణుక,4వ వార్డు సభ్యులు శ్రీ కన్నెబోయిన సైదులు,5వ వార్డు సభ్యురాలు కన్నెబోయిన రాములమ్మ 8వ వార్డు సభ్యులు కన్నెబోయిన లింగమల్లు,గ్రామ పెద్దలు,యువకులు, ఆడపడుచులు మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.   మద్యం లేని గ్రామం ఆరోగ్యకరమైన కుటుంబం బంగారు భవిష్యత్తు దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు గ్రామ పెద్దలు,మహిళలు,ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333