మందకృష్ణ మాదిగ పోరాట ఫలితమే ఎస్సీ వర్గీకరణ ఆమోదం

Mar 23, 2025 - 19:58
Mar 23, 2025 - 20:38
 0  6
మందకృష్ణ మాదిగ పోరాట ఫలితమే ఎస్సీ వర్గీకరణ ఆమోదం

సూర్యాపేట జిల్లా*  పెన్ పహాడ్ మండలం  దూపహడ్ గ్రామంలో 

మూడు దశాబ్దాల ఎస్సీ వర్గీకరణ పోరాటం 

మందకృష్ణ మాదిగ తమ రక్త మాంసాలను ఉడికించి మాదిగ జాతి భవిష్యత్ తరాలకు చిరుకానుకగా మిగిలాడు 

MRPS సూర్యాపేట జిల్లా 

అధ్యక్షులు చింత వినయ్ బాబు మాదిగ.

పెన్ పహాడ్ 23 మార్చ్ 2025 తెలంగాణవార్త ప్రతినిధి. వివరణ:- పద్మశ్రీ మందకృష్ణ మాదిగ* గారు సుదీర్ఘ కాలం మడమ తిప్పకుండా రాజీలేని పోరాటం చేయడం వలన నేడు తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణ బిల్లు ఏకగ్రీవంగా ఆమోదం పొందిందని MRPS సూర్యాపేట జిల్లా అధ్యక్షులు చింత వినయ్ బాబు మాదిగ* అన్నారు. దూపహాడ్ గ్రామం పెన్ పహాడ్ మండలం వర్గీకరణ ఆమోదం పొందడాన్ని స్వాగతిస్తూ MRPS, MSP, MSF అనుబంధ ఆధ్వర్యంలో మందకృష్ణ మాదిగ చిత్రపటానికి పాలాభిషేకం చేసి అన్నదానం కార్యక్రమాన్ని నిర్వచించి సంబరాలు నిర్వహించడం జరిగింది. మిఠాయిలు ప్రజలకు పంపిణీ చేయడం జరిగింది.

ఈ పాలాభిషేక కార్యక్రమం ఎంఎస్పి మండలం అధ్యక్షులు గుగ్గిళ్ల శాంసన్ మాదిగ అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని సమన్వయం నిర్వహించించిన గుగ్గిళ్ల పిచ్చయ్య మాదిగ. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న చింత వినయ్ బాబు మాదిగ* మాట్లాడుతూ మందకృష్ణ మాదిగ లేకుంటే ఎస్సీ వర్గీకరణ పోరాటం లేదని అన్నారు.

తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణ ఆమోదం పొందడం ద్వారా 70 ఏళ్ల మాదిగల కల నెరవేరిందని అన్నారు. డా. బిఆర్ అంబేడ్కర్ దళితులకు రిజర్వేషన్లు అందిస్తే మందకృష్ణ మాదిగ ఆ రిజర్వేషన్లను దళితుల్లోని అన్ని కులాలకు అందిస్తున్నారని అన్నారు. న్యాయమైన లక్ష్యం కోసం పోరాటం బలంగా చేస్తే ఏనాటికైనా విజయం వరిస్తుందని ఎమ్మార్పీఎస్ ఉద్యమం రుజువు చేస్తుందని అన్నారు. మాదిగ అమరుల త్యాగాలు ఉద్యమం లక్ష్యం వైపు సాగేలా నడిపించాయని, అమరులకు జోహార్లు తెలిపారు.

గౌరవ అతిధులు :- ఎమ్మార్పీఎస్ మండల ఇంచార్జి&జిల్లా నాయకులు మోలుగురి రాజు మాదిగ హాజరై మాట్లాడుతూ 30 సంవత్సరాలుగా ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు నాయకులు కమిట్మెంట్ కాన్సెప్ట్ తో జాతి విముక్తి చేయడమే లక్ష్యంగా అలుపెరుగని పోరాటాలు నిత్యం ఉద్యమించరు కనుకనే అధినేత మందకృష్ణ మాదిగ గారి ఆదేశం నాయకత్వంలో ప్రభుత్వాల మెడలు వంచి 30 సంవత్సరాలుగా నిత్యం పోరాటాలు కొనసాగించామని MEF జిల్లా నాయకులు తిరుమలేష్ మాదిగ ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది.

ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు దొంగరి సైదులు మాదిగ, ఆర్తి శ్రీనివాస్ మాదిగ  గ్రామ ఉప అధ్యక్షులు మేకల నగేష్ మాదిగ, ప్రధాన కార్యదర్శి మాతంగి సైదులు మాదిగ, గౌ సలహాదారులు నన్నెపంగు కిరణ్ మాదిగ, ఏడుకొండలు మాదిగ, అరవింద్ మాదిగ, అంజయ్య మాదిగ, సుధాకర్ మాదిగ, అబ్రహాం మాదిగ, వెంకన్న మాదిగ, గోవర్ధన్ మాదిగ, మాతంగి వినయ్ మాదిగ, సతీష్ మాదిగ, సంపత్ మాదిగ, కె,సతీష్ మాదిగ, శ్రీను మాదిగ, సంపత్ మాదిగ, లింగయ్య మాదిగ, పుష్ప మాదిగ, మోజెష్ మాదిగ, ప్రవీణ్ మాదిగ, రవి మాదిగ, ఝాన్సీ మాదిగ, సైదమ్మా మాదిగ, వెంకటమ్మ మాదిగ, శ్రీలత మాదిగ, ఉమారాణి మాదిగ, రేణుక మాదిగ, ముత్తమ్మ మాదిగ, చంద్రకళ మాదిగ, వెలిషమ్మ మాదిగ, శారదా మాదిగ, గ్రామ పెద్దలు, గ్రామ కుల సంఘాల పెద్దలు, తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333