మందకృష్ణ మాదిగ నాయకత్వంలో పోరాటాన్ని బలోపేతం చేయాలి
తిరుమలగిరి 23 ఆగస్టు 2026 తెలంగాణ వార్త రిపోర్టర్:- సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండల కేంద్రంలో పద్మశ్రీ మందకృష్ణ మాదిగ పిలుపు మేరకు ఎమ్మార్పీఎస్, ఎంఎస్పీ అనుబంధ సంఘాల ముఖ్య కార్యకర్తల మండల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మహాజన సోషలిస్టు పార్టీ మాజీ జిల్లా అధ్యక్షులు, తిరుమలగిరి మండల ఇన్‌చార్జి యాతాకుల రాజన్న మాదిగ, ఎమ్మార్పీఎస్–ఎంఎస్పీ ఉమ్మడి జిల్లా సీనియర్ నాయకులు కందుకూరి సోమన్న మాదిగ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకులు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ నాయకత్వంలో మూడు దశాబ్దాలుగా మాదిగల ఆకాంక్ష అయిన ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ కోసం ఉద్యమం కొనసాగించామని తెలిపారు. దండోరా ఉద్యమ పోరాటం ద్వారా వికలాంగులు, వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలకు పెన్షన్లతో పాటు దేశంలో ఎక్కడా లేని విధంగా ఆరోగ్యశ్రీ పథకం సాధించడంలో ఉద్యమం కీలక పాత్ర పోషించిందన్నారు.
ఆర్థిక, రాజకీయ సమానత్వం, సామాజిక సమానత్వం, వివక్షతలేని సమసమాజ స్థాపన లక్ష్యంగా పద్మశ్రీ మందకృష్ణ మాదిగ నాయకత్వంలో పోరాటాన్ని మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. పీడిత వర్గాలతో పాటు సబ్బండ వర్గాల ప్రజలను ఏకం చేసేందుకు గ్రామ, మండల స్థాయిలో నూతన కమిటీలను ఏర్పాటు చేయాలని నాయకులు సూచించారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ ఉమ్మడి నల్గొండ జిల్లా సీనియర్ నాయకులు కందుకూరు శ్రీను మాదిగ విహెచ్పిఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు వేముల వెంకన్న ఎమ్మార్పీఎస్ డప్పు కళాకారుల సంఘం మండల అధ్యక్షులు కందుకూరు రవి మాదిగ ఎమ్మార్పీఎస్ డప్పు కళాకారుల సంఘం నాయకులు కొమ్ము సోమన్న మామిడాల మాజీ సర్పంచ్ దంతాలపల్లి యాకన్న. ఎమ్మార్పీఎస్ తిరుమలగిరి మండల సీనియర్ నాయకులు దంతాలపల్లి సోమన్న, కొమ్ము ఎల్లయ్య, బోడ సోమయ్య, కందుకూరి మహేష్, జేరిపోతుల శ్రీకాంత్, పల్లెర్ల సురేష్, కొమ్ము వెంకట్, మల్లెపాక అనిల్, కొమ్ము చిన్న మహేష్, దంతాలపల్లి ఈశ్వర్, పోతరాజు భాస్కర్, చెరుకు గిరి, పోతరాజు వెంకటేష్, మల్లెపాక యాదగిరి, కొమ్ము రమేష్, కొమ్ము మదార్, (కొమ్ము ఎల్లయ్య పెద్ద మ్యాతరి ) కొమ్ము చిరంజీవి, వేముల శ్రావణ్, తదితరులు, పాల్గొన్నారు..