మంత్రి పదవి మాలో ఎవరికీ ఇచ్చిన పర్వాలేదు మాదిగ ఎమ్మెల్యేలు

సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన మాదిగ ఎమ్మెల్యేలు...
మాదిగలకు మంత్రి పదవి ఇవ్వాలని కోరిన మాదిగ ఎమ్మెల్యేలు
తిరుమలగిరి 24 మే 2025 తెలంగాణ వార్త రిపోర్టర్:- త్వరలో జరిగే మంత్రివర్గ విస్తరణ లో మాదిగ సామజిక వర్గానికి అవకాశం కల్పించాలంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని కలిసి వినతి పత్రం అందజేసిన ఎస్సీ మాదిగ సామాజికవర్గం ఎమ్మెల్యేలు మందుల సామెల్ , అడ్లూరి లక్ష్మణ్ కుమార్, వేముల వీరేశం, కాలే యాదయ్య , సంఖ్యాపరంగా ఆధిపత్యం కలిగిన మాదిగ సామాజిక వర్గానికి మంత్రివర్గ విస్తరణలో చోటు కల్పించాలంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి వినతి పత్రం అందజేసారు. రాష్ట్రంలోని దళిత జనాభాలో 60 శాతం మాదిగలు ఉన్నారు.సమాన ప్రాతినిధ్యం కోసం మంత్రివర్గంలో మాదిగ సామాజికవర్గం నుండి మంత్రిని నియమించడాన్ని పరిశీలించాలని. మంత్రివర్గ విస్తరణలో సామాజిక న్యాయాన్ని, సామాజిక స్ఫూర్తిని నింపాలని కోరారు. త్వరలో జరుగబోయే మంత్రివర్గ విస్తరణలో కచ్చితంగా మాదిగలకు మంత్రి పదవి ఇవ్వాలని కోరారు.....