మండల అధికారులతో రైతుల యూరియా యాప్ అవగాహన సదస్సు
అడ్డగూడూరు 20 డిసెంబర్ 2025 తెలంగాణవార్త రిపోర్టర్:– రైతులు ఈ నెల 22 నుండి రబీ సీజన్లో తమ పంట అవసరాలకు కావలసిన యూరియా కొరకు మొబైల్ యాప్ (ఫెర్టిలైజర్ బుకింగ్ యాప్)ద్వారా మీకు దగ్గరలోని ఫెర్టిలైజర్ షాప్ లలో బుక్ చేసుకొనడానికి మాత్రమే అవకాశం కలదు.కావున రైతులందరూ తప్పని సరిగా యాప్ ద్వారా బుకింగ్ చేసుకొనవలసినదిగా తెలుపుతూ.. రైతులందరికీ ఈ విషయంలో అవగాహన కల్పించాలని ఏఈఓలు, పంచాయతి సెక్రటరీలు మరియు జిపిఓలుకు ఈ సమావేశం ద్వారా తెలియపరచడమైనది.
ఈ సమావేశంలో తాసిల్దార్ శేషగిరిరావు, ఎంపీడీవో శంకరయ్య, ఏవో పాండురంగ చారి, తదితరులు పాల్గొన్నారు.