మండలంలో ప్రధానోపాధ్యాయులు మరియు వంట ఏజెన్సీలకు MDM పై ఒకరోజు శిక్షణ కార్యక్రమం

Jun 12, 2026 - 20:36
 0  1
మండలంలో ప్రధానోపాధ్యాయులు మరియు వంట ఏజెన్సీలకు MDM పై ఒకరోజు శిక్షణ కార్యక్రమం
మండలంలో ప్రధానోపాధ్యాయులు మరియు వంట ఏజెన్సీలకు MDM పై ఒకరోజు శిక్షణ కార్యక్రమం

జోగులాంబ గద్వాల 12 జూన్ తెలంగాణ వార్త ప్రతినిధి:- ఎర్రవల్లి. మండల విద్యాశాఖ కార్యాలయం, కొండేరు నందు ఈరోజు మధ్యాహ్న భోజన పథకం (MDM) అమలుకు సంబంధించి ప్రధానోపాధ్యాయులు మరియు వంట ఏజెన్సీ ప్రతినిధులకు ఒకరోజు శిక్షణ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి మండలంలోని PS, UPS మరియు ZPHS పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, కుక్ కమ్ హెల్పర్లు, వంట ఏజెన్సీ ప్రతినిధులు మరియు మండల విద్యాశాఖ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మండల విద్యాశాఖ అధికారి 
 మాట్లాడుతూమధ్యాహ్న భోజన పథకం విద్యార్థులకు పౌష్టికాహారం అందించడంలో కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. పథకం అమలులో నాణ్యత, పరిశుభ్రత, పారదర్శకతకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. రికార్డుల నిర్వహణ, స్టాక్ నమోదులు, మెనూ అమలు, ఆహార భద్రతా ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని కోరారు. ప్రధాన ఉపాధ్యాయులు పా గుంటమాట్లాడుతూ, ప్రధానోపాధ్యాయులు మరియు వంట ఏజెన్సీలు సమన్వయంతో పనిచేసి విద్యార్థులకు సకాలంలో నాణ్యమైన భోజనం అందించేందుకు కృషి చేయాలని సూచించారు. ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలను కచ్చితంగా అమలు చేస్తూ పథకాన్ని విజయవంతం చేయాలని కోరారు.

అదేవిధంగా ZPHS  మధ్యాహ్న భోజన పథకం అమలులో నాణ్యతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, పాఠశాలలలో పరిశుభ్రత, ఆహార భద్రతా ప్రమాణాలు, మెనూ అమలు మరియు రికార్డుల నిర్వహణను క్రమబద్ధంగా చేపట్టాలని సూచించారు. ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలను ప్రతి పాఠశాలలో సమర్థవంతంగా అమలు చేసి విద్యార్థులకు ఉత్తమ సేవలు అందించాలని కోరారు.

ఈ శిక్షణ కార్యక్రమంలో MDM నిర్వహణ, రికార్డుల నిర్వహణ, స్టాక్ రిజిస్టర్ల నిర్వహణ, వెరిఫికేషన్ విధానాలు, ఆహార భద్రతా ప్రమాణాలు, వంటశాల నిర్వహణ మరియు ప్రభుత్వ మార్గదర్శకాల అమలు తదితర అంశాలపై సమగ్ర అవగాహన కల్పించడం జరిగింది.


కార్యక్రమంలో పాల్గొన్న ప్రధానోపాధ్యాయులు, వంట ఏజెన్సీ ప్రతినిధులు మరియు సిబ్బంది MDM పథకాన్ని మరింత సమర్థవంతంగా అమలు చేసి విద్యార్థులకు నాణ్యమైన సేవలు అందించేందుకు కృషి చేస్తామని తెలిపారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333