భారత్ మాల కాంట్రాక్టర్లు బింగి దొడ్డి చెరువు నుండి అక్రమంగా తరలిస్తున్న మట్టి రవాణాను ఆపాలి

Aug 12, 2024 - 19:05
 0  1
భారత్ మాల కాంట్రాక్టర్లు బింగి దొడ్డి చెరువు నుండి అక్రమంగా తరలిస్తున్న మట్టి రవాణాను ఆపాలి

  జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం అందజేసిన ఐజ మత్స్యకార సంఘం.

????ఐజ మండలం బింగు దొడ్డి చెరువు నుండి సిక్స్ లైన్ కాంట్రాక్టర్లు అక్రమంగా తరలిస్తున్న మట్టి రవాణాను ఆపాలని ఐజ మండల కేంద్రానికి చెందిన మత్స్యకార సంఘం నాయకులు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి మాస్టర్ షేక్షావలాచారి గారి RDS మాజీ నీటి సంఘం అధ్యక్షులు తానగల సీతారామ రెడ్డి గారు ఐజ పట్టణ అధ్యక్షులు అడ్వకేట్ మధు కుమార్ గార్ల ఆధ్వర్యంలో ఈరోజు జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం అందజేశారు.

????ఈ సందర్భంగా  మాస్టర్ షేక్షావలి ఆచారి గారు మరియు మత్స్య సహకార సంఘం అధ్యక్షుడు దరిశెల్లి మాట్లాడుతూ...

???? గత రెండు సంవత్సరాలుగా భారత్ మాల సిక్స్ లైన్ కాంట్రాక్టర్లు ఇలాంటి అనుమతులు పొందకుండా బింగి దొడ్డి చెరువు నుండి పై ఒండ్రు మట్టిని తొలగించి 50 అడుగుల లోతుల్లో మొరము త్రవ్వి సిక్స్ లైన్ కు తరలిస్తున్నారు. ఇట్టి విషయంపై సంబంధిత ఇరిగేషన్, మైనింగ్ అధికారులను సంప్రదిస్తే ఎలాంటి అనుమతులు మా నుండి పొందలేదని అధికారులు చెప్పారన్నారు.

????1984 నుండి ఈ చెరువులో ఐజ పట్టణానికి చెందిన మత్స్యకారులు చేప పిల్లలను వదిలి వాటిని పెంచి  చిరు వ్యాపారంతో కుటుంబాలను నడుపుకునేవారు.

????ఇవాళ సిక్స్ లైన్ కాంట్రాక్టర్లు 50 అడుగుల లోతు మట్టిని తీయడంతో చేపలను వదిలే అవకాశం లేక దాదాపు 500 కుటుంబాలు రోడ్డున పడే దుస్థితి ఏర్పడిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

????మిషన్ కాకతీయ చట్టం కింద మూడు అడుగుల లోతు కంటే ఎక్కువ తీయకూడని అవకాశం ఉంటది కానీ దాదాపు 50 అడుగుల లోతుల్లో మట్టిని తీసి అక్రమ చర్యలకు పాల్పన్నారని భారత్ మాల కాంట్రాక్టర్లపై విరుచుకుపడ్డారు.

????వీళ్ళ లక్షల మెట్రిక్ టన్నుల మట్టిని అక్రమంగా తరలించరని అదేవిధంగా వడ్డేపల్లి మండలం తనగల గట్టు విషయంలోనూ తక్కువ పరిమిషన్ తీసుకొని వేల టన్నుల మెట్రిక్ టన్నుల మట్టిని తరలించి అక్రమాలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

????ఈ అక్రమాలకు పాల్పడిన కాంట్రాక్టర్లపై అధికారులు చర్యలు చేపట్టి  రోడ్డున పడ్డ 500 మత్స్యకార కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.

????ఈ కార్యక్రమంలో ఆర్డీఎస్ మాజీ చైర్మన్ తనగల సీతారామరెడ్డి ,ఐజ పట్టణ అధ్యక్షులు మాస్టర్ మధు కుమార్ మత్స్యకార సంఘ నాయకులు, తదితరులు పాల్గొన్నారు

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333