భగత్ సింగ్ ఆశయలను సాధించండి
తిరుమలగిరి 24 మార్చి 2024 తెలంగాణ వార్త రిపోర్టర్
భగత్ సింగ్, రాజగురు, సుఖదేవుల ఉద్యమ స్ఫూర్తితో యువత మతోన్మాదానికి, పాసిజా ని కి వ్యతిరేకంగా పోరాడాలని అఖిలభారత ప్రగతిశీల రైతు సంఘం జిల్లా కార్యదర్శి పేర్ల నాగయ్య పిలుపునిచ్చారు. భగత్ సింగ్ 93 వ వర్ధంతి నిర్వహించారు. భగత్ సింగ్ చిత్రపటాని పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1931 మార్చి 23న ఆనాటి బ్రిటిష్ ప్రభుత్వం భగత్ సింగ్ రాజగురు సుఖదేవులను చట్ట విరుద్ధంగా ఉరితీసింది అన్నారు. ఉరి తీయబడతామని తెలిసి ఆ ముగ్గురు వీరులు ఇంక్విలాబ్ జిందాబాద్ అంటూ ఆకాశం ప్రతిధ్వనించేలా నినాదాలు చేశారని, తమ అమూల్యమైన ప్రాణాలను దేశమాత కోసం సమర్పించారని కొని ఆడినారు. నేటి మోడీ ప్రభుత్వం భగత్ సింగ్ ఆశయాలను నెరవేరుస్తామని చెబుతూనే, ఆయన ఆశయాలను తుంగలో తొక్కారని దుయ్యబట్టారు. ఆర్ఎస్ఎస్ తదితర మత సంస్థలకు వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఎంఎల్ మాస్ లైన్ డివిజన్ నాయకులు కందుకూరి కొండయ్య, ఐ ఎఫ్ టి యు జిల్లా నాయకులు వేర్పుల కర్ణాకర్, యేష బోయిన గంగయ్య, షర్టు నరసయ్య, భారతమ్మ, రమేష్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.