బోరు పంపులు రిపేర్ ఎప్పుడు మా బిందెలు నిండి నీలు త్రాగేది ఎప్పుడు
త్రాగటానికి ఇబ్బందులు పడుతున్నాము ఎవ్వరు స్పందించడంలేదు
మా గ్రామంలో పేరు గాంచినా పెద్ద పెద్ద బడా నాయకులు ఉన్నారు కానీ ఇట్టి సమస్యలవైపు తొంగిచూడరు
జోగులాంబ గద్వాల నాలుగు డిసెంబర్ 2024 తెలంగాణ వార్తా ప్రతినిధి: మానవపాడు మండలం జల్లాపురం గ్రామంలో ఎస్సీ కాలనీలో మూడు చేతి బోరు పంపులు ఉన్నాయి ఇందులో రెండు ఉపయోగంలో లేవు ఇప్పుడు మా కాలానికి ఇది ఒక్కటే ఉంది ఈ బోరు పంపుకు రంధ్రాలు పడటంతో నీలురాక బిందె నిడటం లేదు మేము ఈ పంపు నీలు త్రాగుతాము చాలా ఇబ్బందులు పడుతున్నాము. ఈ గ్రామంలో ఉన్న నాయకులు ఎన్నికలకు వస్తే మరో ఎన్నికల వరకు ఈ ఎస్సీ కాలనీ వైపు తొంగి చూడరు. ప్రభుత్వ అధికారులను అడిగితే మా దగ్గరా పైసలు లేవని చెప్తున్నారు ఇలా ఉంటే బోరు పంపులు రిపేర్ ఎప్పుడు మా బిందెలు నిండి నీలు త్రాగేది ఎప్పుడు అంటున్నా కాలనీ వాసులు ఇప్పటికైనా సంబంధిత అధికారులు మా సమస్యను తీర్చాలని గ్రామం లోని కాలనీవాసులు కోరుతున్నారు