బోనాల పండుగ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక

Aug 16, 2026 - 15:43
Aug 16, 2026 - 15:44
 0  7
బోనాల పండుగ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక
బోనాల పండుగ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక

ఏఐసీసీ సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి 

రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నాయకులు పోతు భాస్కర్

మున్సిపల్ చైర్‌పర్సన్ మొరిశెట్టి నివేదిత లక్షాది

సూర్యాపేట 17 ఆగస్టు 2026 తెలంగాణవార్త రిపోర్టర్:- తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బోనాల పండుగ సందర్భంగా సూర్యాపేట పట్టణంలోని 48వ వార్డులో పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, కౌన్సిలర్ వెలుగు వెంకన్న ఆహ్వానం మేరకు శ్రీ కోట మైసమ్మ తల్లి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన ఏఐసీసీ సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నాయకులు పోతు భాస్కర్, మున్సిపల్ చైర్‌పర్సన్ మొరిశెట్టి నివేదిత లక్షాది.

ఈ సందర్భంగా సర్వోత్తమ్ రెడ్డి గారు మాట్లాడుతూ బోనాల పండుగ తెలంగాణ ప్రజల ఆధ్యాత్మిక విశ్వాసాలు, ఆచార వ్యవహారాలు, సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతిబింబమని అన్నారు. తరతరాలుగా కొనసాగుతున్న తెలంగాణ సంస్కృతికి బోనాల పండుగ ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చిందని పేర్కొన్నారు. అమ్మవారిని భక్తిశ్రద్ధలతో కొలవడం మన సంప్రదాయంలో ఎంతో విశిష్టమైనదని తెలిపారు.

అమ్మవారి చల్లని ఆశీస్సులతో ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో జీవించాలని ఆయన ఆకాంక్షించారు. ప్రతి కుటుంబంలో శాంతి, సంతోషం, సౌభాగ్యం వెల్లివిరియాలని, తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండటంతో పాటు నియోజకవర్గం మరింత అభివృద్ధి సాధించాలని అమ్మవారిని కోరినట్లు తెలిపారు.

ప్రజలందరూ బోనాల పండుగను భక్తిశ్రద్ధలతో, ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని సర్వోత్తమ్ రెడ్డి కోరారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కుమ్మరికుంట్ల వేణుగోపాల్, మాజీ కౌన్సిలర్ ఈర్ల వాసు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు, మాజీ జెడ్పిటిసి చింతమళ్ల రమేష్, జిల్లా కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అబ్దుల్ రహీం, మున్సిపల్ కౌన్సిలర్లు కొండపల్లి దిలీప్ రెడ్డి, గుణగంటి హేమ సతీష్,మన్నెం అరుణ మల్లేష్, జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు ఎలిమినేటి అభినయ్, శ్రీ దండు మైసమ్మ దేవస్థానం చైర్మన్ తంగేళ్ల కరుణాకర్ రెడ్డి, జిల్లా సేవదల్ చీఫ్ ఆలేటి మాణిక్యం, కాంగ్రెస్ నాయకులు నాగేల్లి అరుణ్ కుమార్, నరేందర్ నాయుడు, రాచకొండ శ్రీనివాస్, జూలకంటి నాగరాజు, చెంచల నిఖిల్, అబ్బాస్, గుగులోత్ నాగు నాయక్, పడిదల రవి, గుణగంటి సైదులు గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333