బాల్య వివాహాల నిర్మూలనకు గ్రామస్థాయి నుంచే కృషి చేయాలి
జిల్లా శ్రీ శిశు సంక్షేమ శాఖ అధికారి సునంద.
జోగులంబ గద్వాల 25 సెప్టెంబర్ 2026 తెలంగాణ వార్తా ప్రతినిధి : శుక్రవారం ఐడీఓసీ మీటింగ్ హాల్‌లో జిల్లా బాలల పరిరక్షణ విభాగం, మహిళా అభివృద్ధి & శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బాల్య వివాహ నిరోధక చట్టం-2006, వివాహాల తప్పనిసరి నమోదు చట్టం మరియు బాల్య వివాహ్ ముక్త్ భారత్ (BVMB) పోర్టల్‌పై పంచాయతీ కార్యదర్శులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా సంక్షేమ అధికారి D. సునంద మాట్లాడుతూ బాల్య వివాహాలను పూర్తిగా నిర్మూలించి బాలికలకు విద్య, ఆరోగ్యం, భద్రత, మెరుగైన భవిష్యత్తు కల్పించేందుకు గ్రామస్థాయి నుంచే సమన్వయంతో కృషి చేయాలని అన్నారు. గ్రామ బాలల పరిరక్షణ కమిటీలు (VCPCs) ద్వారా బాల్య వివాహాల నివారణకు చర్యలు చేపట్టాలని, సమాచారం అందిన వెంటనే అధికారులకు తెలియజేసి వివాహాలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు.
అలాగే గ్రామంలో జరిగే ప్రతి వివాహాన్ని తప్పనిసరిగా నమోదు చేయాలని, వివాహాల నమోదు బాల్య వివాహాలను గుర్తించి నివారించడంలో సహాయపడుతుందని తెలిపారు. BVMB కార్యక్రమంలో భాగంగా గ్రామ సభలు నిర్వహించి బాల్య వివాహ రహిత గ్రామాలుగా తీర్మానం చేసి, వివరాలను BVMB పోర్టల్ (stopchildmarriage.wed.gov.in)లో అప్‌లోడ్ చేయాలని, అన్ని గ్రామాలను అక్టోబర్ 2న బాల్య వివాహ నిరోధక అధికారులు ( సి ఓ ఎంపీ ఓ ఎస్.) బాల్య వివాహ రహిత గ్రామాలుగా ప్రకటించేలా చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులకు సూచించారు.
కార్యక్రమంలో డిఆర్డిఓ ముషాహిదా బేగం, డీపీవో శ్రీకాంత్, ఎంపీడీఓలు, ఎంపీవో లు, డీసీపీఓ నరసింహ, సర్పంచులు, సిబ్బంది పాల్గొన్నారు.