బాలల సంక్షేమం అందరి బాధ్యత ఇటిక్యాలలో గ్రామస్థాయి బాలల పరిరక్షణ కమిటీ సమావేశం
జోగులాంబ గద్వాల 8 సెప్టెంబర్ 2026 తెలంగాణ వార్తా ప్రతినిధి : ఇటిక్యాల గ్రామము జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బాలల సంక్షేమంపై గ్రామ స్థాయి బాలల పరిరక్షణ కమిటీ నిర్వహించారు. ఈ సందర్భంగా చైల్డ్ హెల్ప్ లైన్ కోఆర్డినేటర్ శివలీల మాట్లాడుతూ గ్రామస్థాయి బాలల పరిరక్షణ కమిటీ నెలలో ప్రతి రెండవ మంగళవారం నిర్వహించడం జరుగుతుంది . ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం గ్రామంలోని బాలల యొక్క సమస్యలపై కమిటీలోని సభ్యులందరూ చర్చించడం జరుగుతుంది. ఈ కమిటీ గ్రామ సర్పంచ్ జివేందర్ రెడ్డి అధ్యక్షతన 15 మంది సభ్యులతో ఏర్పాటు చేయడం జరిగింది. కమిటీ ద్వారా బాలల సమస్యలను పరిష్కరించాలని సూచించారు. అలాగే బాలల సంక్షేమం కోసం చైల్డ్ హెల్ప్ లైన్ 1098 అను టోల్ ఫ్రీ నెంబర్ దేశవ్యాప్తంగా పనిచేస్తుందని, 24 గంటలు సేవలు అందించే ఉచిత హెల్ప్ లైన్ నెంబర్ అని అన్నారు. పిల్లలు స్వేఛ్చాయుత వాతావరణంలో పెరగాలని ఆకాంక్షించారు. ఆడపిల్లలపై సోదరభావంతో ఉండాలని అన్నారు. బాలల లైంగిక వేధింపుల నిరోధక చట్టం 2012 గురించి వివరిస్తూ ఈ చ ట్టం బాలలకు రక్షణ కల్పిస్తుందని పేర్కొన్నారు. బాలల సమస్యల పరిష్కా రం కోసం డయల్ 100, 1098కి ఫోన్ చేయాలని సూచించారు. బాల్య వివాహ నిషేధ చట్టం 2006 ప్రకారం 18 సంవత్సరాలు నిండని అమ్మాయికి 21 సంవత్సరాలు నిండని అబ్బాయికి వివాహం జరిపించకూడదు. ఈ చట్టం గ్రామ స్థాయి నుంచి జిల్లాలో స్థాయి వరకు కూడా బాల్య వివాహ నిరోధక అధికారులను నియమించి బాల్య వివాహలను నిర్ములిస్తున్నది. 18 సంవత్సరాలు నిండని పిల్లలలో ఎదుగుదల ఉండదు ఆలోచించే విధానం తక్కువగా ఉంటుంది. ఒక బాల్య వివాహం జరిపిస్తే లక్ష రూపాయల జరిమానా లేదా రెండు సంవత్సరాల జైలు శిక్ష విధించబడుతుంది కాబట్టి చిన్న వయస్సులో పెళ్లిళ్లు చేయడం నేరమని, అలాంటి సమాచారం తమకు అందించాల ని ఆమె కోరారు. పిల్లల పట్ల తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలని, మొబైల్ ఫోన్ వారి చేతికి ఇచ్చినట్లయితే దాని ద్వారా పిల్లలు చాలా ప్రమాదాలు ఎదుర్కోవడం జరుగుతుందన్నారు. బాల కార్మికులు గా ఎవరైనా పనిచేస్తున్న కూడా ఆ పిల్లలను రిస్క్యూ చేసి చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ముందు హాజరుపరచడం జరుగుతుందన్నారు. బాల కార్మిక నిషేధ చట్ట ప్రకారం పనిలో ఉంచుకున్న యజమాని మరియు తల్లిదండ్రులపై కేసు నమోదు గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ జీవేందర్ రెడ్డి , ఉప సర్పంచ్ నాగరాజు , పాఠశాల ప్రధానోపాధ్యాయులు పాగుంట , పంచాయతీ కార్యదర్శి రమేష్ , అంగన్వాడీ టీచర్ నాగేంద్రమ్మ, వార్డ్ మెంబెర్స్, పాఠశాల సిబ్బంది మరియు పిల్లలు పాల్గొన్నారు.