రైతు నేస్తం రైతు వేదిక లో వీడియో కాన్ఫరెన్స్ అనుసంధాన కార్యక్రమం
రైతులు ఖరీఫ్ పంటలు నమోదు చేసుకోవాలి ఏఈఓ సురేందర్.
జోగులాంబ గద్వాల 8 సెప్టెంబర్ 2026 తెలంగాణ వార్తా ప్రతినిధి : ఇటిక్యాల . మండలంలోని చాగాపురం గ్రామం రైతు వేదిక నందు ప్రోపోసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ శాఖ విశ్వవిద్యాలయం ఎలక్ట్రానిక్ వింగ్ తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ శాఖ రైతు నేస్తం ప్రత్యక్ష వీడియో కాన్ఫరెన్స్ కార్యక్రమం ప్రతి మంగళవారం రైతు వేదిక నందు వీడియో కాన్ఫరెన్స్ కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో వ్యవసాయ శాఖశాస్త్రవేత్తలు రైతులకు పంటలపై పలు సూచనలు ఇవ్వడం జరుగుతుంది కనుక ఈ కార్యక్రమానికి గ్రామంలోని రైతులందరూ హాజరుకావాలని గ్రామ ప్రజలను ఏఈఓ సురేందర్ కోరారు. రైతులు ఖరీఫ్ పంటలు వేసిన వివరాలను నమోదు చేయించుకోవాలని రైతులను ఏఈఓ కోరారు. రైతులు మీ యొక్క భూమి పాసుబుక్ తీసుకొని వచ్చి రైతు వేదిక దగ్గర పంట నమోదు చేయించుకోవాలని రైతులను ఏఈఓ కోరుతున్నారు. పంట నమోదు చేయించుకోకపోతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే ధాన్యం కొనుగోలు కేంద్రాల దగ్గర అమ్మడానికి అవకాశం ఉండదని ఏఈఓ రైతులకు తెలియజేశారు. యాసంగి రైతులు రైతు భరోసా రైతుల ఖాతాలలో నగదు జమ చేయబడదని ఏఈఓ సురేందర్ రైతులకు తెలియజేశారు. గ్రామ రైతులు సకాలంలో పంట నమోదు చేసుకోవాలని గ్రామరైతులను ఏ ఈ ఓ కోరారు.