బాలల పరిరక్షణ కమిటీ సమావేశం.

Dec 24, 2024 - 23:27
Dec 24, 2024 - 23:28
 0  8
బాలల పరిరక్షణ కమిటీ సమావేశం.
బాలల పరిరక్షణ కమిటీ సమావేశం.

జోగులాంబ గద్వాల 24 డిసెంబర్ 2024 తెలంగాణ వార్త ప్రతినిధి.

కేటి దొడ్డి. మండలం పరిధిలోని  మంగళవారంమహిళా శిశు  సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కేటి దొడ్డి గ్రామం , కేటి దొడ్డి మండలం లో మండల స్థాయి బాలాల పరిరక్షణ కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడ జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా హాజరై అయినటువంటి మండల ఎంపీడీవో  కె.కృష్ణమోహన్  మాట్లాడుతూ, పిల్లల యొక్క రక్షణ , సంరక్షణ బాధ్యత మన అందరిదని అన్నారు.పిల్లల కోసం రాజ్యాంగంలో కొన్ని ప్రత్యేకమైన హక్కులు కలిగి ఉన్నారని తెలియజేస్తూ బాలల హక్కులు అలాగే బాలల చట్టాల గురించి  వాటి యొక్క ప్రాముఖ్యత గురించి అవగాహన కల్పించడం జరిగింది. బాలల హక్కులు అనగా 1.జీవించే హక్కు ,2.రక్షణ పొందే హక్కు , 3.అభివృద్ధి చెందే హక్కు, 4.భాగస్వామ్య హక్కు, ల గురించి హక్కుల గురించి అవగాహన కల్పిస్తూ ప్రతి ఒకరు తెలుసుకోవాలి అన్నారు. అదేవిధంగా బాల చట్టాల పైన కూడా అవగాహన కల్పించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో బాలల హక్కులను కాపాడాలని మరియు పిల్లలు యొక్క హక్కులను వారు పొందే విధంగా చూడాలని కోరడం జరిగింది. పిల్లలు వారి యొక్క  హక్కులను వారు స్వేచ్ఛగా పొందే జీవించే హక్కు ఉంది, కాబట్టి వారి హక్కులను కాపాడాల్సిన బాధ్యత ప్రతి మండల స్థాయి అధికారులపై ఉందని తెలియజేయడం జరిగింది.  బాలల కోసం కొన్ని చట్టాలు ఉన్నాయని కూడా తెలియజేయడం జరిగింది.


 చైల్డ్ మ్యారేజ్ యాక్ట్  బాల్య వివాహ నిరోధక చట్టం పైన కూడా అవగాహన కల్పించారు.  అమ్మాయికి కనీసం18  సంవత్సరాలు పూర్తిగా నిండి ఉండాలి.  మరియు అబ్బాయికి 21 సంవత్సరాలు పూర్తిగా నింగి ఉండాలి,  బాల్యవివాహం ఎవరైనా చేసుకున్నట్లయితే చేసినట్లయితే ఈ చట్టం ప్రకారం రెండు సంవత్సరాల వరకు జైలు శిక్ష లక్ష రూపాయల జరిమానా విధిస్తామని  తెలియజేశారు. బాల్యవివాహాల నిర్మూలించడం కోసం ప్రభుత్వం అందించే  సంక్షేమ పథకాల గురించి తెలియజేయడం. మరియు బాల్య వివాహం చేసుకోవడం ద్వారా వచ్చే నష్టాలు సమస్యల గురించి అవగాహన కల్పించడం కల్పిస్తూ బాల్య వివాహం చేసుకోవడం ద్వారా జీవితంలో వచ్చే కష్టాలు నష్టాలు, భవిష్యత్తులో వచ్చే సమస్యల గురించి కూడా తెలియజేయడం జరిగింది. మరియు ప్రసవ సమయంలో వచ్చే ఆరోగ్య సమస్యలు, పుట్టబోయే పిల్లల్లో వచ్చే ఆరోగ్య సమస్యలు  గురించి అవగాహన కల్పించడం జరిగింది. మండల పరిధిలోని అన్ని గ్రామాలలో గ్రామస్థాయి బాలల పరిరక్షణ కమిటీలను బలోపేతం చేస్తామని తెలియజేయడం జరిగింది, కేటి దొడ్డి మండలాన్ని బాల్య వివాహాలు లేని మండలంగా మరియు బాల కార్మికులు లేని మండలంగా తీర్చిదిద్దడం కోసం అందరం కలిసికట్టుగా పనిచేయాలని కోరడం జరిగింది. 
గ్రామస్థాయిలో పిల్లల యొక్క సమస్యలు ఉన్నట్లయితే మండల స్థాయి బాలల పరిరక్షణ కమిటీకి దృష్టికి తీసుకొని రావాలని వాటిని పరిష్కరించడం కోసం మాము సిద్ధంగా ఉన్నామని కమిటీ సభ్యులకు తెలియజేయడం జరిగింది.
కేటి దొడ్డి మండల విద్యాశాఖ అధికారి కె.వెంకటేశ్వరరావు   మాట్లాడుతూ 18 సంవత్సరాలలోపు పిల్లలకు భారత రాజ్యాంగంలో కొన్ని హక్కులు, చట్టాలు ఉన్నాయని వాటిని మనమందరం కాపాడాలని, వారి అభివృద్ధి కోసం మనం కృషి చేయాలని అన్నారు.  18 సంవత్సరాల లోపు పిల్లలపై లైంగిక వేధింపుల పాల్పడినట్లయితే చట్టం ప్రకారం  వారికి కనీసం ఏడు సంవత్సరాల వరకు జైలుశిక్ష ఉంటుందని అని అని తెలియజేశారు.పరిచయం లేని వ్యక్తులకు దూరంగా ఉండి మాట్లాడాలని మరియు వారం చెప్పే మాయమాటలు విని మోసపోవద్దని తెలియజేయడం జరిగింది. మరియు కౌమార దశలో వచ్చే శారీరక ,మానసిక వికాసంలో వచ్చే మార్పుల గురించి అవగాహన కల్పించడం జరిగింది.
 బడి మానేసిన పిల్లలు ఎవరైనా ఉన్నట్లైతే పిల్లలను గుర్తించి తిరిగి బడిలో చేర్పించాలని కోరడం జరిగింది. 18 సంవత్సరాల లోపు పిల్లలు ఎవరైనా ఆ పని లో పెట్టుకున్నట్లైతే చైల్డ్ లేబర్ యాక్ట్ ప్రకారం శిక్షిస్తామని తెలియజేయడం జరిగింది, ప్రభుత్వం అమ్మాయిల కోసం  అందించే ఉచిత విద్య, వసతి వసతి సౌకర్యాల గురించి తెలియజేయడం జరిగింది.

.సీడీపీఓ .
కె . వెంకటేశ్వరి,మాట్లాడుతూ 18 సంవత్సరాలలోపు పిల్లలను ఎవరైనా  హింసలకు వేధింపులకు అవుతున్నట్లయితే  వారి యొక్క సమస్యలును   1098,100 టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా తెలియ చేయాలని చెప్పడం జరిగింది. చైల్డ్ హెల్ప్ లైన్ నెంబర్ 24/7 పిల్ల లెక్క రక్షణ కోసం పనిచేయడం జరుగుతుందని తెలియజేయడం జరిగింది. 1098 కి   కాల్ చేసినట్లయితే  వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని ఈ కార్యక్రమంలో తెలియజేయడం జరిగింది.
ఎంవి ఫౌండేషన్ మండల కోఆర్డినేటర్ కిరణ్  మాట్లాడుతూ పిల్లలకు రాజ్యాంగంలో కొన్ని హక్కులను కల్పించడం జరిగింది కావున పిల్లలు వారి హక్కుల ను స్వేచ్ఛగా పొందే విధంగ విధంగా చూడాలని మండల స్థాయి అధికారులను కో…

G.THIMMA GURUDU Jogulamba Gadwal Staff Reporter Jogulamba Gadwal District Telangana State