*బాలపేట డాన్ అజ్మీర శ్రీను అర్ధరాత్రి వీరంగం...?

Aug 27, 2024 - 19:05
 0  29
*బాలపేట డాన్ అజ్మీర శ్రీను అర్ధరాత్రి వీరంగం...?

మట్టి వాహనాలను ఫోటోలు తీస్తే.. డ్రైవర్లతోబెదిరింపులకు ఉసిగొలిపిన"మట్టి మాఫియా డాన్"

ఇంతకీ రఘునాధపాలెం మట్టి మాఫియా సభ్యులను అదుపులోకి తీసుకున్న బృందంలో ఉన్నాడా...?

ఎక్కడిదీ ధైర్యం..? ఏం చూసుకొని ఈ అరాచకం..?

అండగా నిలబడిన రింగు లీడర్ ఎవరు..?

బాలపేటలో బరితెగించి అర్ధరాత్రి మట్టి అక్రమ రవాణా..?

 తెలంగాణ వార్త...ఖమ్మం క్రైమ్ ప్రతినిధి ఆగస్టు 27:- ఖమ్మం అర్బన్ మండలం బాల పేటలో అర్ధరాత్రి ఓ మట్టి మాఫియా డాన్ తమ సిబ్బంది డ్రైవర్లను ఉసిగొలిపి  విలేకరులపై వీరంగం వేసిన ఉదంతమిది. ఆదివారం మస్కా చీకటితో మొదలైన మట్టి అక్రమ రవాణా సమాచారాన్ని స్థానికులు ద్వారా తెలుసుకున్న విలేకరులు మట్టిని అక్రమంగా తరలిస్తున్న లారీ డ్రైవర్లను సిబ్బందిని విలేకరులు వివరాలు అడిగారు. దీంతో స్పందించిన మట్టి మాఫియా సిబ్బంది తమ మట్టి మాఫియా డాన్ అజ్మీరశీనుకు ఫోన్లో సంప్రదించి సంభాషిస్తుండగా ఎవడురా మీడియా?

 అడ్డొస్తే ఇబ్బందులు తప్పవని చెప్పు? ఫోటోలు వీడియోలు తీస్తే రెచ్చిపోయి అడ్డుకోండి అంటూ ఆదేశాలు జారీ చేయడం విశేషం. ఎటువంటి అనుమతులు లేకుండా దర్జాగా అక్రమ మట్టి తవ్వకాలు జరపటం నేరమని తెలిసిన గాని మీడియాపై డా న్ అనుచరులు డాన్ రెచ్చిపోయి వీరంగం వేయటం వెనుక అధికార పార్టీ అండదండలు పుష్కలంగా ఉన్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇటీవల రఘునాధపాలెం మండలం పువ్వాడ ఉదయ్ నగర్ వైఎస్ఆర్ నగర్ తదితర చోట్ల అక్రమంగా మట్టి రవాణా చేస్తున్న విచారించేందుకు పేరు మోసిన మట్టి మాఫియా సభ్యులను అదుపులోకి తీసుకొని విచారించినట్లు విశ్వసనీయ సమాచారం మేరకు తెలుస్తోంది.

అయినప్పటికీ ఖమ్మం అర్బన్ మండలంలో మండల రెవెన్యూ అధికారులు మైనింగ్ పోలీస్ ఎన్ఫోర్స్మెంట్ వ్యవస్థలు  పట్టినట్లుగా వ్యవహరిస్తున్నట్లు బాలపేట స్థానికులతో పాటు మండల ప్రజలు బహిరంగంగా విచారం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పైగా మట్టి మాఫియా అక్కడ మా రవాణాలను చిత్రీకరించడానికి వెళ్లిన విలేకరులపై అట్రాసిటీ కేసులు పెడతానని బెదిరించడం విశేషం. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ మైనింగ్ డిపార్ట్మెంట్ స్పందించి మస్కచీకటితో మొదలై ప్రతిరోజు ఖమ్మం పట్టణం వెంచర్లకు వైరా తదితర ప్రాంతాలకు అక్రమంగా మట్టిని రవాణా చేస్తున్న మట్టి విమాఫియా డాన్ పై నిఘా పెట్టి అక్రమ మట్టి వ్యాపారాన్ని అడ్డుకోవాల్సిన అవసరం ఉన్నదని పలువురు స్థానికులు మండల ప్రజలు అంటున్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333