బాబు జగ్జీవన్ రామ్ 116వ జయంతి

Apr 5, 2024 - 15:35
Apr 5, 2024 - 18:55
 0  1
బాబు జగ్జీవన్ రామ్ 116వ జయంతి

దేవరకొండ 05 ఏప్రిల్ 2024 తెలంగాణవార్త ప్రతినిధి:- జీవితకాలం రాజ్యాంగాన్ని పరిరక్షించడానికి నిత్యం ప్రభుత్వాలతో అంతర్గతంగా కొట్లాడి భారత రాజ్యాంగాన్ని కాపాడిన బాబు జగ్జీవన్ రామ్ కార్మిక మంత్రిగా ,భారతదేశం యొక్క మొదటి క్యాబినెట్, భారత రాజ్యాంగ సభలో సభ్యుడు కూడా అయ్యాడు , అక్కడ అతను సామాజిక న్యాయం రాజ్యాంగంలో పొందుపరచబడిందని నిర్ధారించాడు. దేవరకొండ నియోజకవర్గంలో ని (ఐ బి) బంగ్లాలో బాబు జగ్జీవన్ రామ్ చిత్రపటానికి వివిధ కుల సంఘాల నాయకుల ఆధ్వర్యంలో పూలమాలవేసి నివాళులర్పించడం జరిగింది.

 ఈ సందర్భంగా టీఎస్ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ముదిగొండ ఏలేష్, బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు రామావత్ రమేష్ నాయక్,  జర్నలిస్ట్ జంతుక లింగం‘  టీయూడబ్ల్యూజే ఐజేయు ప్రజా సాక్షి రిపోర్టర్ మహేష్ పేర్ల,డివై జేఏసీ ఎర్ర కృష్ణ జాంబవ్ ఎస్బిఐ బ్యాంక్ అధ్యక్షులు ఎన్ వి టి ఎస్సీ సెల్ఎర్ర విజయ్ మాట్లాడుతూ ఏప్రిల్ మాసం ఏప్రిల్ ఫూల్ మాసం కాదు అని ఇది మహానీయుల మాసం వారోత్సవాలు జరుపుకునే మాసంగా ఉంటుందని అదేవిధంగా బాబూజీగా ప్రసిద్ధి చెందిన జగ్జీవన్ రామ్ జాతీయ నాయకుడు, స్వాతంత్ర్య సమరయోధుడు, సామాజిక న్యాయ పోరాట యోధుడు, అణగారిన వర్గాల పోరాట యోధుడు, విశిష్ట పార్లమెంటేరియన్, నిజమైన ప్రజాస్వామ్యవాది, విశిష్ట కేంద్ర మంత్రి, సమర్థ పరిపాలనాదక్షుడు, అసాధారణ ప్రతిభావంతుడైన వక్త. అతను మహోన్నతమైన వ్యక్తిత్వాన్ని కలిగి ఉన్నాడు.  

 సుదీర్ఘ ఇన్నింగ్స్ ఆడాడు, భారతీయ రాజకీయాల్లో అర్ధ శతాబ్దానికి పైగా నిబద్ధత, అంకితభావం  భక్తితో విస్తరించాడు. బాబూజీ ఇంద్రాణి దేవిని జూన్ 1935లో వివాహం చేసుకున్నారు. ఇంద్రాణి దేవి స్వయంగా స్వాతంత్ర్య సమరయోధురాలు, విద్యావేత్త. ఆమె తండ్రి డాక్టర్ బీర్బల్, ప్రఖ్యాత వైద్య నిపుణులు, బ్రిటీష్ సైన్యంలో ఉన్నారు . 1889-90 నాటి చిన్-లుషాయ్ యాత్రలో చేసిన సేవలకు గాను అప్పటి వైస్రాయ్ లార్డ్ లాన్స్‌డౌన్ ద్వారా విక్టోరియా మెడల్‌ను అందుకున్నారు. వారికి 17 జూలై 1938న కుమారుడు సురేష్ కుమార్ 1945 మార్చి 31న కుమార్తె మీరా జన్మించారు. సురేశ్ కుమార్ 21 మే 1985న కన్నుమూశారు, తను బ్రతికి ఉన్నంతకాలం బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేశాడని ఆయన ఆశయాలను కొనసాగిస్తామని తెలిపారు. కార్యక్రమంలో కోర్ర కిషన్ నాయక్,తారి గోవర్ధన్, ముద్దిగోండ హరిదాసు, కోమ్ము ఉదయ్ ఇతరులు పాల్గొన్నారు

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333