**బాపట్ల న్యాయవాది టీ విజయ్ కుమార్ పై దాడినీ ఖండిస్తూ""నందిగామ బార్ అసోసియేషన్*

ఏపీ తెలంగాణ వార్త ప్రతినిధి రావెళ్ళ"""""బాపట్ల న్యాయవాది టి. విజయ్ కుమార్ పై దాడి చేసి, అవమానకరముగా మాట్లాడిన బాపట్ల టౌన్ సిఐ, మరియు ఎస్సై పై చట్టపరమైన తీసుకోవాలని, న్యాయవాదుల రక్షణ కొరకు, అడ్వకేట్ ప్రొటెక్ట్ యాక్ట్ చట్టాన్ని తీసుకురావాలని కోరుతూ నందిగామ బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి అద్దంకి మణిబాబు ఆధ్వర్యంలో న్యాయవాదులు బహిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా న్యాయవాదులు మాట్లాడుతూ న్యాయ వ్యవస్థకు వారధిలా పనిచేసే న్యాయవాదులపై ఇటువంటి దాడులు జరగటం చాలా హేయమైన చర్య అని, ఎంతో పవిత్రమైన న్యాయవాది వృత్తి చేస్తున్న న్యాయవాదుల పట్ల పోలీసు వారు ఇంతటి అమానుషమైన చర్యలకు పాల్పడటం చాలా దారుణమని, న్యాయవాదులపై ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా రాష్ట్ర ప్రభుత్వం గట్టి భద్రత కల్పించాలని, పోలీసులు న్యాయవాదులు ఒక కుటుంబ వ్యవస్థల కలిసిమెలిసి ఉండాలని ఉండాలని, ఎంతో గౌరవప్రదమైన న్యాయవాదుల వృత్తిని అవమానపరిచే విధంగా మాట్లాడి, న్యాయవాది పై దాడి చేసిన పోలీసులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పలువురు న్యాయవాదులు కోరినారు. ఈ కార్యక్రమంలో నందిగామ బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు వరదబోయిన విజయకుమార్, బార్ ట్రెజరర్ మాడుగుల స్టాలిన్ బాబు, సీనియర్ ఎగ్జిక్యూటివ్ నెంబర్ చావలి సాంబశివరావు, బార్ ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ తాడేపల్లి కాంతారావు, వేల్పుల కిషోర్, గారెల్లి అరుణ్ కుమార్, కన్నెగంటి జీవరత్నం, బండి మల్లికార్జునరావు, మట్ట ప్రసాద్, యర్రంరెడ్డి బాబురావు, కన్నెగంటి జీవరత్నం, దాసరి వెంకట్రావు, చాపల శివరామకృష్ణ, పెసరమీల్లి సురేష్, జిల్లేపల్లి రంగారావు, బొబ్బిళ్ళపాటి భాస్కరరావు, కొమ్మినేని మౌళేశ్వరరావు, యరగొర్ల రామారావు, కొనకంచి శ్రీనివాసరావు, బెజవాడ గోపి, నండ్రు గంగాధర్, గుడిసె సుమన్, వేల్పుల ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.