బస్సు క్రింద పడ్డ వ్యక్తి మృతి....

Mar 7, 2024 - 21:22
 0  25
బస్సు క్రింద పడ్డ వ్యక్తి మృతి....

తన స్వగ్రామానికి వెళ్లేందుకు బస్సు ఎక్కిన కొమ్ము ఆనంద రావు (54) కోదాడ డిపో బస్సు ఎక్కారు.అట్టి బస్సులో జనం ఎక్కువగా ఉండడంతో సీట్లు దొరకక మరో బస్సు ఎక్కుదామని ఆ బస్సు క్రిందికి దిగే క్రమంలో వెనుక టైర్ కింద పడగా స్థానికులు ఏరియా ఆసుపత్రికి తరలించిన విషయం తెలిసిందే.కాగా ఈ ప్రమాదంలో మృతుని ఎడమ కాలు నుజ్జు నుజ్జు కావడంతో తీవ్ర రక్త శ్రావం అయ్యింది. ఈ క్రమంలో వైద్యులు చికిత్స అందిస్తుండగానే ఆనంద రావు మృతి చెందాడు. విషయం తెలుసుకున్న భార్య బుచ్చమ్మ ఆసుపత్రికి వచ్చి రోదిస్తోంది.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333