బంధాలు నిలబడాలంటే కాళ్లకుకొన్ని సంకెళ్లు తప్పదేమో !
బంధాలు నిలబడాలంటే కాళ్లకుకొన్ని సంకెళ్లు తప్పదేమో !
ప్రచారంలో ఉన్న కొన్ని కరుకైన మాటలు అదే చెబుతుంది.
ఆపసవ్య దిశలో, గందరగోళం మధ్య కొనసాగుతున్న కుటుంబ జీవితాలకు ప్రశాంతత అవసరం లేదా?
--వడ్డేపల్లి మల్లేశం
సూక్తులు, నినాదాలు, జన వాడుకలో ఉన్నటువంటి అంశాలు, సామెతలు, మంచి మాటలు ఏవైతే నేమి ఆ పదాలకు వాక్యాలకు ఎంతో పదునుంటేనే కదా ప్రజల నాలుకల మీద నడయాడేది, నిరంతరం సమాజాలను శాసించేది, తమ మను గడ ప్రశ్నార్ధకమైనప్పుడు ఈ పదాలే ఉపయోగపడతాయేమోనని ప్రజలు ఆశించేది నిజం కాదంటారా? ఆరోగ్యమే మహాభాగ్యము, మానవుడు సంఘజీవి, సత్యమునే పలుకుము, నోరు మంచిదైతే ఊరు మంచిదౌ వుతుంది వంటి పాతకాలపు ముచ్చట్లు దాదాపుగా అందరికీ తెలుసు. వాటిని ఎంతవరకు అమలు చేస్తున్నారో కానీ వాటిలో ఉన్నటువంటి సారవo తా న్ని నిబద్ధతను నిత్య నూతనత్వాన్ని మాత్రం ప్రతి ఒక్కరు అంగీకరిస్తున్నారు అంటే ఆ అంశాలకు ప్రత్యామ్నాయ విషయాలు రాలేదనే కదా అర్థం. అంతా నిత్య నూతనంగా శక్తివంతంగా అనునిత్యం జీవితానికి ఉపయోగించుకునే స్థాయిలో ఉన్న వాటిని వినియోగించుకోవడం సమన్వయపరచుకోవడం ద్వారా లబ్ది పొందే ప్రయత్నం చేయడం మన ముందున్న ప్రాథమిక అంశంగా భావించాలి. తద్వారా అనేక సమస్యలకు కొంతవరకైనా పరిష్కారం దొరుకుతుందేమో అయితే ఇది ఏకపక్షంగా కొనసాగినప్పుడు ప్రయోజనం అంతగా లభించదు. ఇ రు వర్గాలలోను ఆత్మ పరిశోధన, పశ్చాత్తాపము కొనసాగినప్పుడు మాత్రమే భయంకరమైనటువంటి సమస్యలకు కూడా సున్నితంగా ప్రత్యామ్నాయాలను పరిష్కారాలను కనుగొనడానికి ఆస్కారం ఉంటుంది. పరిష్కారాలు లేకుండా నిత్యం ఘర్షణకు తలపడుతున్న సందర్భంలో ఒక బలమైన వాదన వినిపిస్తాము కావచ్చు కానీ మానసిక ప్రశాంతత లేనప్పుడు ఆ ప్రయోగం ఎవరికోసం? అందుకనే ఈ భయంకరమైన కుటుంబ బంధాలకు సంబంధించి ఎక్కడో దొరికిన ఈ పదబంధాలను ప్రజల అనుబంధాలకు ఉపయోగిస్తే ఫలితం ఉంటుందేమో అనేదే నా ఆశ. నాతో సహా ప్రతి కుటుంబంలోనూ దాదాపుగా ఇవాళ ఎదురవుతున్నటువంటి అనేక సమస్యలు కుటుంబ సమన్వయము ఆవేశ ఆగ్రహాలు ఆధిపత్య భావజాలం తద్వారా కుటుంబ ఘర్షణలను కొంతవరకైనా చరమగీతం పాడడానికి ఉపయోగపడితే అంటే చాలు. ఈ అంశం పెద్దగా తెలవని ది ఏమీ కాదు కానీ ఎందుకు మరి అందులో అంత బలం ఉంది. ఒక ముగింపుకు రావడానికి ప్రస్తుతం ఉన్నటువంటి గడ్డు పరిస్థితికి ప్రత్యామ్నాయంగా ఆలోచించుకోవడానికి నూతన జీవితాన్ని అలవర్చుకోవడానికి తద్వారా మానసిక ప్రశాంతతను పొందడానికి ప్రతి కుటుంబం కూడా ఆశపడుతుంది కదా! ఆ చిరు ఆశ నుండి మొలకెత్తినది ప్రత్యామ్నాయ పరిష్కార మార్గంగా ఉండాలని అనేక జీవితాలకు వెలుగు నివ్వాలని ఒక ముగింపుకు రావాలని ఆశిస్తూ రాస్తున్న స్వీయ అనుభవం, పరిశీలన, పరిశోధనతో పాటు కుటుంబాల ఆవేదన ఇబ్బందుల నుండి ఉద్భవించిన ఈ నా విశ్లేషణను ఆదరిస్తారని ఆహ్వానిస్తూ..
ఇది నిత్యం జరుగుతున్న మాట నిజం కాదా??
చాలా కుటుంబాలలో భార్యాభర్తల మధ్యన నిత్యం ఘర్షణను దాదాపు మనం అంతటా గమనించవచ్చు. వ్యక్తిగత విషయాలు, ప్రాపంచిక అంశాలు, కుటుంబ బంధానికి సంబంధించిన స్వయం ఆలోచనలు, ఆధిపత్య భావజాలం, సాధింపులు బెదిరింపులు అనే పలు అంశాలు కుటుంబ బంధాలలో ప్రధానంగా చోటు చేసుకుంటాయి. అనేక రహస్యాలు దాచిపెట్టడం దోచిపెట్టడం, అబద్ధాలు పంతాలు పట్టింపులు, పన్నాగాలు, తన వరకే పరిమితం చేసుకోవడం, తన వర్గానికి మాత్రమే చేరవేయడం, తన పిల్లలకు తన తల్లిదండ్రుల వారసత్వాన్ని మాత్రమే పరిమితం చేయడం, ఆస్తిపాస్తులపైన అధిపత్యాన్ని నిలబెట్టుకోవడం కోసం కుటుంబ పెద్ద మనుషులను చులకనగా చూడడం, వారి సంపాదనను అంగీకరించకపోవడం, తోబుట్టుల మధ్యన వచ్చినటువంటి ఘర్షణలు వివాదాలను ఏకపక్షంగా ఆమోదించడం, ఆస్తిపాస్తుల విషయంలో దాపరికం, ఆదాయంతో సంబంధం లేకుండా ఖర్చులకు మాత్రం ఎగబడే వింత ధోరణి, తల్లిదండ్రులను ఒక తీరు తన భాగస్వామి తల్లిదండ్రులను మరొక తీరుగా పరిగణించడం, పిల్లలకు తమ వాదనలను మాత్రమే పరిమితం చేసి జీవిత భాగస్వామికి వ్యతిరేకంగా మలుచుకోవడం వంటి కుటుంబ అనుభవాలను మనం గమనిస్తున్నప్పుడు ఇవన్నీ కూడా ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ, కుటుంబ ఘర్షణకు నిత్య వివాదాలకు విడాకులకు, కోర్టు కేసులకు, పోలీస్ స్టేషన్లకు, పెద్దమనుషులకు పరిమితమవుతున్న మానసిక ఆందోళనలుగా మనం అంగీకరించి తీరాలి.
చాలామంది మా కుటుంబంలో భార్యాభర్తల మధ్యన పిల్లల మధ్యన ఎలాంటి మనస్పర్ధలు లేవని హాయిగా ప్రశాంతంగా పరస్పర సమన్వయంతో ఉన్నామని గొప్పగా చెప్పుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. కొందరు తమ బాధలను దాచుకోవడం, మరికొందరు ఇతరుల బాధలను దోచుకోవడానికి ప్రయత్నం చేయడం, ఇంకొందరు నిత్యం మానసిక క్షో భకు గురి చేయడం, వాళ్ల వాళ్ల అలవాటుగా మారుతూ జన జీవితాన్ని చిద్రం చేస్తు సామాజిక సంక్షోభం నుండి వ్యవస్థను సక్కపెట్టడానికి పరిష్కారాలను ఆలోచించకపోతే కోర్టులో పోలీస్స్టేషన్లో అనేక ఇతర సంస్థలు కూడా ఏ మూలకు సరిపోవు పైగా వచ్చిన మార్పు కూడా ఏమంతగా లేదు. ప్రధానంగా భార్యాభర్తల మధ్యన పరస్పర అవగాహనకు విఘా థము కలిగించే మౌలిక అంశాలను పక్కనపెట్టి ఆదిపత్యాన్ని రుద్దడానికి ప్రయత్నం చేస్తున్న సందర్భంలో ఈ ఘర్షణలు చోటు చేసుకోవడాన్ని మనం గమనించవచ్చు. మరికొన్ని కుటుంబాలలో మానసిక వైకల్యం, అతి తెలివి, చెప్పుడు మాటలు, మైండ్ క్రాక్, తా ము పట్టిన కుందేటికి మూడే కాళ్లు అన్న చందంగా వ్యవహరించే ధోరణి కూడా నిత్యం జగడాలకు కారణం అవుతూ ఉంటుంది. కొన్ని కుటుంబాలలో నైతే పెళ్లైన నుండి సావు వరకు ఏ రోజు కూడా సర్దుబాటు అయ్యింది లేదు, పరస్పరం గౌరవించుకున్నది లేదు. తద్వారా తమ పిల్లలకు చక్కని వారసత్వాన్ని అందించిన దాఖల అంతకు ఉండదు అలాంటప్పుడు బతుకులు ఎందుకు? నిత్యం బజారులో ఘర్షణ పడుతూ ఉండడం, అనేకమంది పెద్దమనుషులు వచ్చి దుమ్మెత్తి పోయడం నిందించడం, ఎందరు చెప్పినా వినకపోవడం, అవస్థల పాలు కావడం బజారులో అవమానాలకు గురికావడం, వృద్ధులు పెద్దలు తల్లిదండ్రులను పోషణ విషయంలో సక్రమంగా చూసుకోక అవహేళనకు ఇబ్బందులకు గురి చేసినటువంటి వాళ్ళ జీవితాలను బజారులోనే నిలదీసిన సందర్భాలను జ్ఞప్తికి తెచ్చుకుంటే అంతకుమించిన బాధాకరమైన సన్నివేశం మరొకటి ఉంటుందా? ఈ అన్ని అంశాలు కూడా రెండు వర్గాలకు తెలియనివి ఏమీ కావు. ఆవేశం ఆగ్రహం, పంతాలు పట్టింపులు, చెప్పుడు మాటలు తల్లిదండ్రుల పక్షపు వాళ్లు వీరి పక్షాన వ్యవహరించడం, ప్రాపంచిక దృక్పథo " 0", తమ మాటే నెగ్గాలనే వింత ధోరణి కూడా భార్యాభర్తల్లో ఘర్షణకు దారి తీసి వాళ్ళ కళ్ళ ముందే పిల్లలు బుద్ధిహీనులు అక్రమార్కులు కోపిస్టులు అవగాహన రాహిత్యం గల వాళ్ళుగా తయారవుతూ ఉంటే మనం ఈ వ్యవస్థ ద్వారా భవిష్యత్ తరాలను ఆశించే ప్రత్యామ్నాయ జ్ఞానోదయం ఇదేనా ?
("తప్పు ముఖ్యమైతే మనిషిని మరిచిపో మనిషి ముఖ్యమైతే తప్పును మర్చిపో ప్రతి తప్పుని పట్టుకొని ఉంటే ఏ బంధం నిలబడదు"")
గాలికి ఎన్నో రకాలైనవి కొట్టుకొని వస్తూ ఉంటాయి అయితే అందులో మనకు ఉపయోగపడేవి కూడా లేకపోలేదు అలాగే వాట్స్అప్ గ్రూపులో వచ్చిన పై మాట జీవిత బంధాలను శాశ్వతం చేయడానికి ఘర్షణలను నివారించడానికి పశ్చాత్తాప పడి తమ తప్పులను సవరించుకోవడానికి సారవంతమైన జీవితం గడపడానికి ఇరు వర్గాలను కూడా మెప్పించగలదేమో అనే విశ్వాసంతో ఈ వ్యాసం రాయడానికి నాకు ప్రేరణ లభించినది. ప్రధానంగా స్త్రీల పక్షాన సాధింపులు బెదిరింపులు, డిమాండ్స్ కొన్ని పంతాలు పట్టింపులు ఎక్కువగా ఉంటాయనేది జన వాక్యం. అదే సందర్భంలో పురుషుల పక్షాన కూడా కొంత ముర్కత్వం లొసుగులు లోపాలు కూడా లేకపోలేదు. కానీ ఎంత వారలైనా కాంతదాసులే అని ఒక మాట ఉన్నట్లు చివరికి అర్ధాంగికి అనుసంధానంగా జీవించకపోతే పూట గడవడం చాలా ఇబ్బందులు ఉండే పరిస్థితులు మాత్రం నగ్న సత్యం. ఆ పరిస్థితిని ఆసరాగా చేసుకుని కొంత వంచించడం అధికమైనప్పుడే ఈ ఇబ్బందులు తలెత్తుతూ కుటుంబాలకు కుటుంబాలే వీధిపాలవుతున్నాయి. ఎంతో మంది బుద్ధి జీవులు మేధావులు శాస్త్రవేత్తలు సర్వోన్నతులు కూడా ఈ ప్రవాహంలో కొట్టుకొని పోతున్నారు. దీనికి ముగింపు పలకడానికి ఆలోచించకూడదా?
జీవిత బంధమే ప్రధాన అనుకున్నప్పుడు ఇరు వర్గాలు కూడా వ్యక్తిని కాపాడుకోవడానికి ప్రయత్నం చేయాలి. చెట్లను కాపాడుకుంటే గాలి నీరు వాతావరణాన్ని ఏ రకంగా సమకూర్చుతుందో మనిషిని కాపాడుకుంటే కూడా గౌరవం మర్యాద ఉనికి ప్రశాంతత లభిస్తుంది. అందుకే ప్రతి తప్పును భూతద్దంలో చూడకుండా అప్పటికప్పుడే దాన్ని వదిలేయాలి. మనిషిని కాపాడుకున్నామనే సంతోషాన్ని ఒ o ట పట్టించుకోవాలి లేదా ఎంత ప్రయత్నించినా వ్యక్తిత్వాలు మారనప్పుడు, జీవితాన్ని విధ్వంసం చేస్తున్నప్పుడు తప్పును సవరించుకోలేము అంగీకరించలేము అనుకున్నప్పుడు ఆ మనిషిని ఆ జీవిత భాగస్వామిని మరిచిపోవడమే ఉత్తమంఅని ఈ సూక్తి చెబుతుంది. కానీ గందరగోళ మనస్తత్వంతో అటు తప్పును ఇటు మనిషిని అంగీకరించే విషయంలో తృణీకరించే విషయంలో నిర్ణయం తీసుకోకుండా ఊగి సలాడ్తే కొంతమందికి ప్రయోజనం కావచ్చు కానీ భార్యాభర్తలు ఇద్దరికీ మాత్రం జీవితం నరకప్రాయమే. ఈ నరకప్రాయమైన జీవితాన్ని ఎందుకు మనం శాశ్వతం చేసుకోవాలి? కొంత మార్చుకుందాం! కొంత మారుద్దాం! పశ్చాత్తాపంతో రగిలిపోదాం! నూతన జీవితాన్ని ప్రారంభిద్దాం! అనే సోయి మనకెందుకు ఉండకూడదు? ఇదే సందర్భంలో "తల్లిదండ్రులు పెద్ద మనుషులు అక్కా చెల్లెలు వాళ్ళ వారసులు ఈ రెండు వర్గాలకు కూడా నచ్చజెప్పి మందలించి గద్దరించి అవసరమైతే సూటిపోటి మాటలతో కూడా గట్టిగా అవమానిస్తే పశ్చాత్తాపడతారు, తప్పులను సవరించుకుంటారు, భవిష్యత్తులో పొరపాట్లు చేయకుండా ఉంటారు. ఆస్తులు ఉద్యోగాలు సంపదలు ఎన్ని ఉండి కూడా ప్రశాంతత లేని కోట్లాది కుటుంబాలకు జీవితాలకు ప్రత్యామ్నాయా న్ని చూపకపోతే మనం ఎందుకు? ఈ ఘర్షణలో మనము కూడా భాగస్వాములం కాదా? మనము నిత్యం ఇబ్బందులు ఎదుర్కోవడం లేదా? కొందరు బయటకు చెప్పుకోవడం, కొందరు అవమానంతో క్రుంగి పోవడం, కొందరు ఇక మా జీవితం ఇంతేనని లొంగిపోవడం కు బదులు ఈ సూక్తి (సూత్రం)లోని వాస్తవాన్ని గుర్తిస్తే గుడ్డిలో మెల్ల లాగా హాయిగా బతకచ్చు. సాధ్యమైనంతవరకు వ్యక్తి ముఖ్యమని తప్పు కాదని వ్యక్తిని కాపాడుకునే ప్రయత్నం చేద్దాం. పరస్పర ప్రేమ అనురాగాలను ద్విగునీకృతం చేసుకుంటే ఈ జీవితానికి శోభని, సంతోషాన్నిస్తుంది. స్థబ్దంగా, మౌనంగా, బాధ్యత మరిస్తే మానవ జన్మకే తీవ్ర అపచారం చేసినవాళ్ళమౌతాం."
(ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడు)