ఫ్రీ ప్రైమరీ తరగతులను ప్రారంభించిన సర్పంచ్.

Jul 2, 2026 - 00:02
 0  1
ఫ్రీ ప్రైమరీ తరగతులను ప్రారంభించిన సర్పంచ్.

 షాబాద్  సర్పంచ్ డేవిడ్. 

 జోగులాంబ గద్వాల 1 జులై 2026 తెలంగాణ వార్తా ప్రతినిధి :-  మండలం పరిధిలోని షాబాద్ గ్రామంలోని యుపిఎస్ పాఠశాల  లో ప్రీ ప్రైమరీ తరగతులను షాబాద్ గ్రామ సర్పంచ్ డేవిడ్ , ప్రధానోపాధ్యాయులు రాంబాబు  మరియు ఉప సర్పంచ్ పరశురాముడు  ప్రారంభించడం జరిగింది. ప్రధానోపాధ్యాయులు రాంబాబు మాట్లాడుతూ.....తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మంచి వసతులు కల్పించి మన గ్రామంలోనే ప్రీ ప్రైమరీ తరగతులు ప్రారంభించడం మంచి పరిణామం. గ్రామంలో ఉన్న 4 సంవత్సరాలు దాటిన పిల్లలను పాఠశాలకు పంపి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని విద్యార్థినీ విద్యార్థుల తల్లిదండ్రులను కోరారు.  ఈ సందర్భంగా సర్పంచ్ డేవిడ్ మాట్లాడుతూ....పాఠశాల ఉపాధ్యాయులు మా గ్రామానికి మండలానికిమంచి పేరు వచ్చే విధంగా  ఉపాధ్యాయులు మా గ్రామ పిల్లలకు మంచి  విద్యాబుద్ధులు నేర్పాలని ఉపాధ్యాయులను  సందర్భంగా ఆయన కోరారు. ఉపాధ్యాయులు ఉపాధ్యాయినీలు పాఠశాలకు సరియైన టైం కు వచ్చి విద్యార్థులకు మంచి విద్యాబోధన అందించాలని ఉపాధ్యాయులను కోరారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ బృందం, ప్రీ స్కూల్ ఇన్స్ట్రక్టర్ గిరిజ , అంగన్వాడీ టీచర్స్ గ్రామంలో యువకులు తదితరులు ఉన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333