ఫార్మా కంపెనీ వ్యతిరేకంగా 9వ తేదీన పాదయాత్ర విజయవంతం చేయాలి.

Oct 7, 2024 - 19:34
 0  2
ఫార్మా కంపెనీ వ్యతిరేకంగా 9వ తేదీన పాదయాత్ర విజయవంతం చేయాలి.

మాజీ శాసనసభ్యులు పట్నం నరేందర్ రెడ్డి గారు ఈరోజు కొడంగల్ నియోజకవర్గం దుద్యాలు మండలం గౌరారంలో పత్రిక విలేకర్ సమావేశంలో మాజీ శాసనసభ్యులు పట్నం నరేందర్ రెడ్డి గారు మాట్లాడుతు  కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి పది నెలలు గడుస్తున్న , కొడంగల్ నియోజకవర్గం ప్రజలకు ఎన్నికల్లో ముందు సీఎం అవుతానని చెప్పి, కొడంగల్ కి అనేక అభివృద్ధి చేస్తానని చెప్పి ప్రజలను మభ్యపెట్టి గెలవడం జరిగింది అన్నారు, మరియు అదే విధంగా కొడంగల్ నుంచి తెలంగాణ రాష్ట్రానికి సీఎం అయిన తర్వాత కొడంగల్ నియోజకవర్గం లో ఫార్మా కంపెనీ తెచ్చి , ఇక్కడ రైతులను బెదిరించి భూమిని తీసుకోవడం ఎంతవరకు న్యాయం, ఫార్మా కంపెనీ తెచ్చి ఇక్కడ ఉన్న రైతుల నోట్లో మట్టి కొడుతున్నాడు, దీనిని వ్యతిరేకంగా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో 9వ తేదీన నిర్వహించే పాదయాత్రను  ఇందులో ముఖ్య నాయకులు మాజీ మంత్రివర్యులు శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్సీ నవీన్ కుమార్ , మాజీ శాసనసభ్యులు పట్నం నరేందర్ రెడ్డి పాల్గొంటారు, ఈ పాదయాత్ర ఫార్మా కంపెనీ రైతులు వ్యతిరేకంగా, మరియు రైతులకు రుణమాఫీ, కండిషన్ లేకుండా రుణమాఫీ చేయాలి, పాదయాత్రలను నిర్వహిస్తున్నారు, ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున రైతులు తరలిరావాలని కోరారు, బుధవారం రోజు పోలేపల్లి ఎల్లమ్మ దేవత దేవాలయం దగ్గర నుండి ఉదయం 7:00 గంటలకు ఫార్మా కంపెనీ వ్యతిరేకంగా పాదయాత్ర ప్రారంభం, మధ్యాహ్నం దుద్యాల ఎమ్మార్వో ఆఫీస్ వరకు పాదయాత్ర ఉంటుందని అన్నారు మాజీ శాసనసభ్యులు పట్నం నరేందర్ రెడ్డి, ఇందులో హకీంపేట్,పోలేపల్లి ,లగచర్ల , ఈర్లపల్లి ,పులిచెర్లకుంటతండా , రోటిబండ తండా , ఈర్లపల్లి తండా గ్రామాలకు సంబంధించిన ఫార్మా బాధితులు రైతులు, గ్రామ వాసులు,తండా వాసులు, తరలి రావాలని కోరారు,
ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ పార్టీ నాయకులు , కార్యకర్తలు , మండలం పార్టీ అధ్యక్షులు, కౌన్సిలర్లు, మాజీ జడ్పిటిసి, మాజీ ఎంపీపీ,మాజీ సర్పంచ్, మాజీ ఎంపీటీసీ, పెద్ద ఎత్తున తరలి రావాలని కోరారు,
ఈ కార్యక్రమంలో ఫార్మా వ్యతిరేకంగా పోరాట సమితి నాయకులు, మండల్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు..

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333