ప్రేమ పెళ్లికి నిరాకరించారని ఆత్మహత్య చేసుకున్న ప్రేమజంట

Apr 28, 2024 - 16:42
 0  33
ప్రేమ పెళ్లికి నిరాకరించారని ఆత్మహత్య చేసుకున్న ప్రేమజంట

తెలంగాణ వార్త ఆత్మకూరు యస్ ప్రతినిధి. తుమ్మలపెన్ పహాడ్ గ్రామంలోప్రేమ పెళ్లికి పెద్దలు నిరకరించారని ఆత్మహత్య చేసుకున్నరు. వివరాల్లోకి వెళ్ళితే తుమ్మలపెన్ పహాడ్ గ్రామానికి చెందిన గుండగని సంజయ్ 25 సూర్యాపేటలో డెలివరీ బాయ్ గా చేస్తున్నాడు సుబ్బా సముద్రం చెందిన సల్లగుండా నాగజ్యోతి 21 వీరిద్దరి గత ఐదు సంవత్సరాలుగా ప్రేమీ oచుకుంటున్నారు.ఈ విషయం ఇద్దరి కుటుంబాలకు తెలుసు పెద్దలు ఈ పెళ్లి చెయ్యడానికి నిరాకరించారు. దీంతో మనస్థాపానికి గురైన ఆ యువ జంట ఇక పెద్దలు మన పెళ్లి చేయరని గ్రహించి ఆత్మహత్య చేసుకోవడానికి సిద్ధమయ్యారు.శనివారం రాత్రి పంట పొలంలో పురుగుల మందు తాగి అక్కడే మృతి చెందారు. అదేవిధంగా సూసైడ్ నోట్ లోకొంతమంది పేర్లు ఉన్నట్లు వారిని విచారణ జరిపిస్తారని ఆత్మకుర్ యస్ ఎస్సై సైదులు తెలియజేశారు. దీనికి వీళ్ళ ఇద్దరి కులాలు వేరేకావడం ప్రధాన కారణమని తెలుస్తుంది.