ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో వరి కొనుగోలు కేంద్రాలు ప్రారంభం
18-11-2024 తెలంగాణ వార్త ప్రతినిధి చిన్నంబావి మండలం:- ప్రాథమిక వ్యవసాయ సహకార సంగం ఆధ్వర్యంలో వరి కోనుగోలు కేంద్రాలు ప్రారంభం చిన్నంబావి మండల పరిసర ప్రాంతమైన బెక్కేం గ్రామంలో ఖరీఫ్ సీజన్ కు సంబంధించి వరి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా డిసిసిబి చైర్మన్ మామిళ్లపల్లి విష్ణువర్ధన్ రెడ్డి, మరియు సింగిల్ విండో చైర్మన్ బగ్గారి నరసింహ రెడ్డి, ఆధ్వర్యంలో బేక్కెం మరియు అమ్మాయి పల్లి గ్రామాలలో ఈరోజు వరి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించడం జరిగింది. రైతులు దళారులకు అమ్మి మోసపోవద్దని రైతులు తమ వరి ధాన్యాలను ఆరబెట్టుకొనిఉంటే మద్దతు ధర కు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కొనుగోలు చేయడం జరుగుతుంది.ఏ గ్రేడ్ లావు వడ్లకు 2320 గాను బి గ్రేడ్ వడ్లకు 2200 గా ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది కాబట్టి ఇందులో సన్న రకాలు ఏమైనా ఉంటే వాటికి ప్రభుత్వం బోనస్ 500 చెల్లించడం జరుగుతుంది. అని రైతులకు తెలియజేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో సింగిల్ విండో డైరెక్టర్స్ గుంటి వెంకట్ స్వామి,బాలమ్మ,డేగ శేఖర్ యాదవ్ ,భగవంత్ యాదవ్,శ్రీకాంత్ రెడ్డి,మద్దిలేటి, చిన్యా నాయక్,మరియు మాజీ ప్రజా ప్రతినిధులు, రైతు సోదరులు హమాలీలు, సింగిల్ విండో ముఖ్య కార్య నిర్వహణ అధికారి నాగరాజు కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.