ప్రశాంతంగా ముగిసిన రాష్ట్రస్థాయి క్రికెట్ టోర్నమెంట్

May 11, 2026 - 22:44
 0  3
ప్రశాంతంగా ముగిసిన రాష్ట్రస్థాయి క్రికెట్ టోర్నమెంట్

తిరుమలగిరి 12 మే 2026 తెలంగాణ వార్త రిపోర్టర్

డా.నలమాస క్రిష్ణ ఫౌండేషన్ సహకారంతో ఏప్రిల్ 11న మాలిపురం లో ప్రారంభం అయిన రాష్ట్ర స్థాయి క్రికెట్ టోర్నమెంట్  ముగిసింది.ఈ సందర్భంగా మాలిపురం గ్రామంలో నిర్వహించిన సమావేశంలో పోతరాజు శ్రీనివాస్ అధ్యక్షత వహించగా ముఖ్య అథిగా డా.నలమాస క్రిష్ణ (హైకోర్టు అడ్వకేట్) డా.నల మాస క్రిష్ణ ఫౌండేషన్ చైర్మన్ నల మాస సంధ్య ,కౌన్సిలర్ వెంకట్ రెడ్డి పాల్గొని మాట్లాడారు.ఈ సందర్బంగా డా.నల మాస కృష్ణ మాట్లాడుతూ మొదటి ప్రైజ్ వరంగల్ ,రెండవ ప్రైజ్ తిరుమలగిరి ,మరియు మూడవ ,నాలుగవ బహుమతులు పొందిన క్రీడాకారులకు అభినందనలు తెలిపారు.యువత క్రీడా రంగాల్లో ఇంకా ముందు కి రావాలన్నారు.కొన్ని ప్రాంతాల్లో యువత మత్తు పదార్దాలకు బానిసలు గా మారిపోయి అనేక రకరకాల ఇబ్బందులకు గురవుతున్నారు.అలాంటి వాటిని విడనాడి యువత అంత క్రీడా రంగాల్లో పాల్గొనడం ద్వారా ఉద్యోగా అవకాశాలు కూడా పొందే అవకాశాలు ఉంటాయి. అటు వైపుగా ప్రయాణం చేయాలి అన్నారు.క్రీడల్లో ఆడి ఓడిన వారు కూడా ఎలాంటి నిరాశకు లోనవకూడదు.ఓటమి విజయానికి నాంది పలుకుతుంది .కాబట్టి ఎవరు నిరాశకు లోనూ కాకూడదు.యువత విద్య ,క్రీడా ,ఉద్యోగ ,రాజకీయ రంగల్లో శ్రద్ధ పెట్టాలి అన్నారు. అనంతరం గెలిచిన టీం లకు బహుమతులు అందచేసి అభినందించారు.ఈ కార్యక్రమంలో శేఖర్,జలందర్,సంతోష్ ,సురేందర్ ,గోపి,మల్లేష్ ,వివిధ ప్రాంతాల క్రీడాకారులు పాల్గొన్నారు.

జేరిపోతుల రాంకుమార్ తిరుమలగిరి విలేకరి మరియు తుంగతుర్తి నియోజకవర్గం ఇన్చార్జి