ప్రభుత్వ ఆసుపత్రిలో మూడు నెలలుగా జీతాలు ఇవ్వడం లేదంటూ నిరసనకు దిగిన 0శానిటేషన్ సిబ్బంది
నల్గొండ జిల్లా కేంద్ర ఆసుపత్రిలో గత తొమ్మిది నెలలుగా పీఎఫ్ డబ్బులు చెల్లించడం లేదని.. అలాగే మూడు నెలల నుండి జీతాలు కూడా ఇవ్వడం లేదని ఆందోళన చేపట్టారు.
ఎన్నిసార్లు అడిగినా ఏజెన్సీ పేరు చెప్పి అధికారులు తప్పించుకుంటున్నారని, ఏజెన్సీ వారు ప్రభుత్వం నుండి బిల్స్ రావట్లేదని అంటున్నారని మధ్యలో తాము పస్తులు ఉండాల్సిన దుస్థితి వచ్చిందని శానిటేషన్ సిబ్బంది వాపోతున్నారు.