ప్రత్యేక సమగ్ర సవరణ విజయవంతానికి ప్రతి ఒక్క ఓటరు భాగస్వామి కావాలి
ఇటిక్యాల రెవెన్యూ ఇన్స్ పెక్టర్ మరియు (ఎస్ ఐ ఆర్ ) సూపర్వైజర్ మధు కుమార్.
జోగులాంబ గద్వాల 26 జూన్ 2026 తెలంగాణ వార్త ప్రతినిధి : స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ ఐ ఆర్) కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు చాగాపురం ప్రజలు పూర్తి సహకారం అందించాలని ఇటిక్యాల మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ (ఎస్ ఐ ఆర్ ) సూపర్వైజర్ మధు కుమార్ పిలుపునిచ్చారు.
గురువారం గ్రామంలోని 5 వ వార్డు నందు ఎస్.ఐ.ఆర్ కార్యక్రమంలో భాగంగా అక్షిత రిపోర్టర్ ఎద్దుల.దేవేందర్ రెడ్డి( జిల్లా రిపోర్టర్) ఇంటికి వెళ్లి ఎన్యూమరేషన్ ఫారాలు పంపిణీ చేస్తున్న బి.ఎల్.ఓల పనితీరును ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీని వేగవంతంగా,పారదర్శకంగా పూర్తి చేయాలని బిఎల్ఓ
జి.భాగ్యమ్మను ఆదేశించారు. అర్హులైన ప్రతి ఓటరికి ఎన్యూమరేషన్ ఫారం తప్పనిసరిగా అందేలా చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు.
ప్రజలకు ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియపై పూర్తి అవగాహన కల్పించాలని సూపర్వైజర్ మధు కుమార్ పేర్కొన్నారు.
అనంతరం స్థానిక ప్రజలతో నేరుగా మాట్లాడిన ఆయన ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ ప్రాముఖ్యతను వివరించారు. ఓటరు జాబితాలను మరింత ఖచ్చితమైనవి, పారదర్శకమైనవి మరియు తప్పులు లేనివిగా రూపొందించేందుకు ఈ కార్యక్రమం అత్యంత కీలకమని రెవెన్యూ ఇన్స్పెక్టర్. (సూపర్వైజర్) మధు కుమార్ పేర్కొన్నారు.
అర్హులైన ప్రతి ఓటరు తమ వ్యక్తిగత వివరాలను జాగ్రత్తగా పరిశీలించి,అవసరమైన పత్రాలను జతచేసి ఎన్యూమరేషన్ ఫారాలను పూర్తిగా నింపి సంబంధిత బూత్ స్థాయి అధికారులకు అందజేయాలనీ ప్రజలని ఆయన కోరారు.ప్రజల సహకారంతోనే సమగ్ర, విశ్వసనీయ ఓటరు జాబితాల రూపకల్పన సాధ్యమవుతుందని రెవెన్యూ ఇన్స్పెక్టర్ (సూపర్వైజర్) మధుకుమార్ తెలిపారు. ప్రజలందరూ ఎన్నికల సంఘం చేపడుతున్న ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంలో చురుకుగా పాల్గొని ప్రజాస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో జిపిఓ నాగరాజు,వడ్డే
పరశురాముడు(జిల్లా వడ్డెర సంఘం అధ్యక్షులు) ఉప సర్పంచ్ పరశురాముడు, వార్డ్ మెంబర్ రామకృష్ణ, మైనార్టీ మండల అధ్యక్షుడు అల్లా బకాష్, ఎండి మతీన్, పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.