ప్రజా యుద్ధ నౌక గద్దర్ గాన స్మరణను విజయవంతం చేయాలి ఏపూరి సోమన్న

Aug 28, 2024 - 11:48
Aug 28, 2024 - 11:51
 0  26
ప్రజా యుద్ధ నౌక గద్దర్ గాన స్మరణను విజయవంతం చేయాలి ఏపూరి సోమన్న

నేడు ప్రజాయుద్ధ నౌక గద్దర్ గాన స్మరణను విజయవంతం చేయాలి

సూర్యాపేటలో ఏర్పాట్లను పరిశిలించిన ఏపూరి సోమన్న బృందం

తిరుగుబాటుకు సంకేతం, వసంత మేఘ గర్జన, సాంస్క్రతిక సేనాధిపతి ప్రజా యుద్దనౌక గద్దర్ ప్రథమ వర్ధంతి సందర్భంగా ఏపూరి పౌండేషన్ ఆధ్వర్యంలో నేడు బుధవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని శుఃభమస్తు ఫంక్షన్హాల్లో నిర్వహించే గద్దర్ గాన స్మరణ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ప్రజా గాయకుడు ఏపూరి సోమన్న పిలుపునిచ్చారు. మంగళవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని శుభమస్తు ఫంక్షన్హాలో గద్దర్ గాన స్మరణ ఏర్పాట్లను పరిశీలించి కళాకారులతో కలసి ఆడి పాడి మాట్లాడారు. పాటంటే ఎలా ఉంటుందో చెప్పి ప్రజా ఉద్యమాలు ఎలా ఉంటాయో చెప్పి అందరి గొంతై వినిపించి వారి హక్కుల కోసం కొట్లాడి పంచశీల జెండా చేతబట్టి తన ఆట పాటతో గద్దర్ ప్రజలను చైతన్యం చేశారన్నారు. ఆయన ఆశయాలను ముందుకు తీసుకుపోయే క్రమంలోనే సూర్యాపేటలో ఏపూరి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా గద్దర్ గానస్మరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గద్దర్ గాన స్మరణ కార్యక్రమంలో ఎంఎల్ పార్టీ, బీసీ సంఘాలు, విద్యార్థి సంఘాల నాయకులు భాగస్వాములై పని చేస్తున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా ఉస్మానియా యూనివర్శిటీ ప్రొఫెసర్ ఖాసీం, మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి, టూరీజం కార్పోరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రె డ్డి, ప్రముఖ వాగ్గేయకారులు పసునూరి రవిందర్ లు హాజరవుతున్నట్లు తెలిపారు. నేడు గద్దర్ గాన స్మరణ కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది కళాకారులతో సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఖమ్మం క్రాస్ రోడ్ అంబేడ్కర్ విగ్రహం వద్ద నుంచి సభా ప్రాంగణం వరకు డప్పు చప్పుళ్ళు, కోలాటాలు, కళాకారుల ఆట పాటతో భారీ ర్యాలీ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి కళాకారులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని గద్దర్ ఆశయ సాధనలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో విద్యార్ధి సంఘాల నాయకులు నవలె ఉపేందర్, అనంతుల మధు, బారీ అశోక్, విజయ్లతో పాటు కళాకారులు శ్రీను, రమేష్, నాగరాజు, శేఖర్ తదితరులు ఉన్నారు.

Shake Jaheer Staff Reporter Suryapet District Telangana 508223