ప్రజా పాలనలోనే పేదింటి కల నిజమైంది ఎమ్మెల్యే సామెల్

Jun 19, 2026 - 06:46
 0  178
ప్రజా పాలనలోనే పేదింటి కల నిజమైంది ఎమ్మెల్యే సామెల్

  తిరుమలగిరి 19 జూన్ 2026 తెలంగాణ వార్త రిపోర్టర్

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజా పాలనలో ప్రతి పేద కుటుంబానికి సొంత ఇల్లు ఉండాలన్న కలను సాకారం చేసేందుకు గృహ నిర్మాణ పథకాన్ని ప్రవేశపెట్టినారు. తుంగతుర్తి నియోజకవర్గం తిరుమలగిరి మండలం కోక్య నాయక్ తండ గ్రామ పంచాయతీలో గుగులోతు ఉపేందర్ నూతనంగా నిర్మించిన 'ఇందిరమ్మ ఇళ్లు' గృహప్రవేశ కార్యక్రమాలలో ముఖ్య అతిథిగా తుంగతుర్తి నియోజకవర్గ శాసనసభ్యులు   మందుల సామేలు పాల్గొని ఉపేందర్ కుటుంబ సభ్యులకు నూతన పట్టు వస్త్రాలు  అందించారు

ఈ సందర్భంగా  శాసనసభ్యులు మందుల సామేలు మాట్లాడుతూ తెలంగాణలో అర్హులైన ప్రతి పేద కుటుంబానికి శాశ్వత పక్కా ఇల్లు అందించాలనేదే ప్రజా ప్రభుత్వ లక్ష్యం అని స్పష్టం చేశారు. తుంగతుర్తి నియోజకవర్గం లో ఒక్క నిరుపేద కుటుంబం కూడా గుడిసెల్లో జీవించకుండా, గుడిసెలు లేని నియోజకవర్గం తీర్చిదిద్దడమే కాంగ్రెస్ ప్రజా పాలనా లో నా లక్ష్యం..అన్నారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ హరిప్రసాద్ ఎంపీడీవో లాజర్ గ్రామ సర్పంచ్ ప్రేమ్ ప్రసాద్ గ్రామ కార్యదర్శి పార్టీ నాయకులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు... 

జేరిపోతుల రాంకుమార్ తిరుమలగిరి విలేకరి మరియు తుంగతుర్తి నియోజకవర్గం ఇన్చార్జి