ప్రజావాణి దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి: 

Sep 7, 2026 - 22:47
 0  2
 ప్రజావాణి దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి: 

ప్రజావాణి పోర్టల్‌లో ఎప్పటికప్పుడు ఆన్‌లైన్ నమోదు.. 

 ప్రజావాణి కి జిల్లా స్థాయి అధికారులు తప్పనిసరిగా హాజరు కావాలి

 ప్రజావాణి దరఖాస్తులు 66

జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్  పవార్....

ప్రజల సమస్యల పరిష్కారమే వేదికగా సాగుతున్న ప్రజావాణి కార్యక్రమానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అధికారులను ఆదేశించారు. సోమవారం సమీకృత కలెక్టరేట్‌ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి అనంతరం జిల్లా అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ప్రతి సోమవారం జరుగు ప్రజావాణి కి జిల్లా స్థాయి అధికారులు తప్పనిసరిగా హాజరు కావాలని,  ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా మరియు మండల స్థాయి ప్రజావాణి దరఖాస్తులను తప్పనిసరిగా ఆన్‌లైన్ పోర్టల్‌లో నమోదు చేయాలని స్పష్టం చేశారు.  ప్రజావాణి పోర్టల్‌లో ఇంకా పరిష్కారం కాకుండా ఉన్న దరఖాస్తులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. కొత్తగా అందుతున్న దరఖాస్తులను ఎప్పటికప్పుడు పోర్టల్‌లో నమోదు చేయాలని సూచించారు. ముఖ్యంగా రాష్ట్ర ప్రజావాణిలో పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను తక్షణమే పరిష్కరించేలా సంబంధిత శాఖల అధికారులు ప్రత్యేక చొరవ చూపాలని తెలిపారు. ప్రతి అధికారి తమ లాగిన్ లో ఉన్న పెండింగ్ దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని  లేనియెడల  వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని,  .   ప్రజలు పెట్టుకున్న అర్జీలను పెండింగ్‌లో ఉంచకుండా, నిర్ణీత గడువులోగా వాటిని పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని అన్నారు.
 మండల  స్థాయిలో ప్రారంభమైన ప్రజావాణి కి అన్ని శాఖల మండల స్థాయి అధికారులు తప్పనిసరిగా హాజరయ్యేలా జిల్లా అధికారులు పర్యవేక్షించాలని ఆదేశించారు. మండల  స్థాయి సమస్యలు స్థానికంగానే పరిష్కారమైతే ప్రజలకు ఇబ్బందులు తప్పుతాయని ఆయన పేర్కొన్నారు. 
      సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమం లో భూ సమస్యలకి సంబందించి 35 దరఖాస్తులు, హౌజింగ్ 12, డి పి ఓ 3 , డిఎంహెచ్వో  3, మిగిలిన 13  దరఖాస్తులు వివిధ శాఖలకి చెందినవని, మొత్తం 66 దరఖాస్తులు వచ్చాయాని వాటిని పరిష్కరించేందుకు శాఖల వారీగా పంపించటం జరిగిందని కలెక్టర్ ఈ సందర్బంగా అన్నారు.
      ఈ కార్యక్రమానికి అదనపు కలెక్టర్ బి. హరి సింగ్,  డిఆర్ఓ ప్రేమ్ రాజ్, జిల్లా పరిషత్ సీఈఓ శిరీష, డిఆర్డిఓ పిడి సన్యాసయ్య, డిఎంహెచ్వో వెంకటరమణ, డిఏఓ శ్రీధర్ రెడ్డి, డిఎస్ఓ మోహన్ బాబు, డిడబ్ల్యూఓ నరసింహారావు, మున్సిపల్ కమిషనర్ హనుమంత్ రెడ్డి , జిల్లా అధికారులు తదితరులు హాజరైనారు

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333