ప్రగతి స్కూల్ లో సైన్స్ ఫెయిర్ కార్యక్రమం నిర్వహణ

Feb 25, 2026 - 19:54
 0  9
ప్రగతి స్కూల్ లో సైన్స్ ఫెయిర్ కార్యక్రమం నిర్వహణ
ప్రగతి స్కూల్ లో సైన్స్ ఫెయిర్ కార్యక్రమం నిర్వహణ

 జోగులాంబ గద్వాల 25 ఫిబ్రవరి 2026 తెలంగాణ వార్తా ప్రతినిధి :  గద్వాల పట్టణంలోని బీసీ కాలనీ లో గల ప్రగతి స్కూల్ లో సైన్స్ ఫెయిర్ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. బుధవారం ఈ కార్యక్రమాన్ని నిర్వహించగ   జిల్లా విద్యాధికారి విజయలక్ష్మి సందర్శించి విద్యార్థుల ప్రదర్శనలను తిలకించారు. విద్యార్థులు ప్రదర్శించిన వాటిలో చంద్రయాన్, మోక్ష ప్రదర్శన, సేవ్ ద గర్ల్ చైల్డ్, సేవ్ ట్రీస్, సె నో టూ డ్రగ్స్, ప్రమాదాల నివారణ, హ్యూమన్ అవ్యాలేషన్, సోలార్ ఇరిగేషన్ ప్రదర్శనలు ప్రత్యేకంగా ఆకట్టుకున్నాయి. స్కూల్ లో మొత్తం 530 ప్రదర్శనలు చేయడం జరిగిందనీ స్కూల్ కరస్పాండెంట్ సవరన్న తెలిపారు. ఇవేకాక జాతీయ నాయకుల వేషదారాన, సోషియల్ వర్కర్స్, డాక్టర్, పోస్ట్ మ్యాన్, వివిధ వేషధారణలో మరో 200 మంది విద్యార్థులు ప్రదర్శనలు చేయడం జరిగిందనీ సవరన్న తెలిపారు. విద్యార్థుల ప్రతిభను చూసి డి ఈ ఓ విజయలక్ష్మి హర్షం వ్యక్తం చేస్తూ విద్యార్థులను అభినందించారు.


ఈ ప్రదర్శనలకు స్కూల్ టీచర్లు లత,అరుణ, సత్యన్న, షాహిన, రేవతి ప్రధానమైన భూమిక పోషించారని కరస్పాండెంట్ సవరన్న తెలిపారు. ఈ సందర్శనలో డి.ఈ.ఓ.తో పాటు ఎం.ఈ.ఓ.శ్రీనివాస గౌడ్, టీచర్ మైకేల్ తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333