ప్రగతి గ్రామ సమైక్య మహిళా దినోత్సవ వేడుకలు
ప్రగతి గ్రామ సమైక్య మహిళా దినోత్సవ వేడుకలు
ఎస్.ఆర్.కె.టి స్కూల్ మేదర బస్తి సహకారంతో వేడుకలు
500 మంది మహిళలతో ఘనంగా వేడుకలు
ముఖ్య అతిథులుగా పాల్గొన్న మాజీ మున్సిపల్ చైర్పర్సన్ కాపు సీతాలక్ష్మి
మహిళ శిశు సంక్షేమ అధికారి స్వర్ణలత లెనినా
డాక్టర్ సాగరిక గైనకాలజిస్ట్ మాతా శిశు ఆస్పటల్
డిస్టిక్ మిషన్ కోఆర్డినేటర్ రూప
ఏఎన్ఎంలు ఆశ వర్కర్లు సెక్రటరీలకు ఘన సన్మానం
చుంచుపల్లి మార్చ్ 12 ( ) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండలం గౌతమ్ పూర్ ప్రగతి గ్రామ సమాఖ్య వివో పద్మ ఆధ్వర్యంలో ఎస్ ఆర్ కే.టి స్కూల్ మేదర బస్తి కొత్తగూడెం వారి సహకారంతో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా సింగరేణి గౌతమ్ పూర్ కమ్యూనిటీ హాల్లో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ కాపు సీతాలక్ష్మి మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారి స్వర్ణలత లేనిన డాక్టర్ సాగరిక గైనకాలజిస్ట్ మాతా శిశు ఆస్పటల్ రామవరం డిస్టిక్ మిషన కోఆర్డినేటర్ రూప పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహిళల సమానత్వం ఇంటి నుండే ప్రారంభం కావాలని నిరంతరం మహిళను గౌరవించాలని ఇంట్లో మగ పిల్లలను ఆడపిల్లలను సమానంగా చూడాలని వారన్నారు. సమాజంలో పురుషులతో పాటు మహిళలకు సమాన హక్కులు కలిగి ఉండాలని విద్యా ఉపాధి రాజకీయ రంగాలలో మహిళల భాగస్వామ్యం పెరగాలని ప్రభుత్వ ప్రైవేటు రంగాలలో మహిళలు కీలక స్థానాలను అధిరోహించాలని వారన్నారు. మాజీ చైర్పర్సన్ సీతా లక్ష్మీ మాట్లాడుతూ భర్త కాపు కృష్ణ ప్రోత్సాహంతో రాజకీయాల్లోకి రావడం జరిగిందని అంతకుముందు టీచర్గా పని చేశానని మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని పురుషులతో సమానంగా ప్రభుత్వ ప్రైవేటు రంగాలలో ఉన్నారని అన్నారు. ఇంత పెద్ద కార్యక్రమాన్ని నిర్వహించిన కార్యానిర్వహకులు వివోఏ పద్మ రత్నకుమార్ ని అభినందించిన మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ టిఆర్ఎస్ నాయకురాలు కాపు సీతాలక్ష్మి.. ఈ సందర్భంగా మహిళా శిశు సంక్షేమ అధికారి స్వర్ణలత లేని నా మాట్లాడుతూ చదివే మహిళ సాధికారతకు ప్రధాన ఆధారమని అమ్మాయిలు చదువు ఆ కుటుంబానికి వెలుగునిస్తుందని తల్లిదండ్రులు తమ కుమార్తెకు పూర్తి స్వేచ్ఛనిస్తూ మంచి విద్యను అందించాలని వారు అన్నారు. స్వయం సహాయక సంఘాల ద్వారా మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి ప్రభుత్వం కృషి చేస్తుందని వారన్నారు. మహిళల కొరకు ఇందిరా శక్తి అనే కార్యక్రమాలు ప్రభుత్వం ఏర్పాటు చేసిందని అన్ని రంగాల్లో మహిళలు ఉండాలని ప్రభుత్వం ఇటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు. అన్ని పథకాలు మహిళా చేతుల్లోనూ ఉంటున్నాయని భర్త వంద రూపాయలు ఇవ్వు అనే పరిస్థితి వచ్చిందని మహిళా విజయమని అన్నారు. అనంతరం డిస్టిక్ కోఆర్డినేటర్ రూప మాట్లాడుతూ ఈ సంక్షేమ శాఖలో ట్రాన్స్లేటర్ మహిళలు బాలికలు అందరికీ అండగా ఉంటుందని ఎవరైనా మనకు కష్టం వస్తే 181 కి కాల్ చేయవచ్చు అని మీకు ఏ కష్టం వచ్చినా ముందుగా చెప్పుకోవాలని వారు అన్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా ఆటల పోటీలు నిర్వహించిన ప్రగతి గ్రామ సమాఖ్య. గెలుపొందిన వారికి బహుమతులు అందజేయడం జరిగింది. అనంతరం వందమంది మహిళలను సన్మానించడం జరిగింది. ఏఎన్ఎంలు ఆశా వర్కర్లు పంచాయతీ మహిళ సెక్రటరీలను శ్వేత మండల సమైక్య సీసీలు చుంచుపల్లి మండల వివో ఏల కు బొకే అందజేసి శాలువాతో ఘనంగా సన్మానించిన ప్రగతి గ్రామ సమైక్య. మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా లందరికీ శుభాకాంక్షలు తెలియజేసిన ప్రగతి గ్రామ సమాఖ్య అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల ఆర్గనైజర్ రత్నకుమార్.ఈ కార్యక్రమంలో మహిళా దినోత్సవ కమిటీ సభ్యులు ఉమా సుమ లావణ్య మల్లేశ్వరి మహిళ సాదరిక సభ్యులు సాహితీ ప్రియాంక సీసీలు భాగ్యమ్మ సత్యవతి పంచాయితీల మహిళా సెక్రటరీలు జక్కంపూడి షర్మిల అజ్మీరా ఇందిరా దండబోయిన లలిత బూదకూరి నర్మదా బానోతు భూమిక వివో ఏలు స్వర్ణ రేఖ రేష్మా రోస్ రమ జయ జాల విజయ కావ్య మై మున్నీసా స్వరూప లక్ష్మి యమునా శ్రీలత లావణ్య సంకీర్తన మహేశ్వరి సరిత అకౌంటెంట్ వింధ్య ఎమ్మెస్ అధ్యక్షురాలు రాజకుమారి. అందర్నీ ఉత్తేజపరిచిన యాంకర్ స్నేహ. కార్యక్రమం విజయవంతంలో కృషిచేసిన మాజీ వార్డు నెంబర్ శివ లక్ష్మణ్ సతీష్ గిరి కి కృతజ్ఞతలు తెలియజేసిన ప్రగతి గ్రామ సమైక్య.