పౌష్టిక ఆహారంతోనే సంపూర్ణ ఆరోగ్యం

తిరుమలగిరి 20 ఏప్రిల్ 2025 తెలంగాణ వార్త రిపోర్టర్
తిరుమలగిరి మున్సిపాలిటీ లో పోషణ పక్షం కార్యక్రమం నిర్వహించడం జరిగింది .ఈ కార్యక్రమంలో డాక్టర్ వందన మాట్లాడుతూ గర్భిణీలకు బాలింతలకు చిన్నారులకు పౌష్టిక ఆహారంతోనే సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని అన్నారు. రక్తహీనత రాకుండా ఆకుకూరలు పప్పు దినుసుల గురించి వివరించారు. అంగన్వాడి సెంటర్లో ఇచ్చే పౌష్టికాహారం లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. అనంతరం అన్నప్రాసన ,సీమంతాలు, అక్షరాభ్యాసం కార్యక్రమం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఎంఈఓ శాంతయ్య గారు ,సూపర్వైజర్స్ కందుకూరి మంగమ్మ, ఎండి కైరున్నిసా, కే ప్రమీల, ఏఎన్ఎం, అంగన్వాడీ టీచర్స్, అంగన్వాడీ హెల్పర్స్, ఆశాలు గర్భవతులు ,బాలింతలు, తల్లులు తదితరులు పాల్గొన్నారు.