పోషకాహారంపై అవగాహన 

Sep 25, 2026 - 19:33
 0  1
పోషకాహారంపై అవగాహన 
పోషకాహారంపై అవగాహన 

 జోగులాంబ గద్వాల 25 సెప్టెంబర్ 2026 తెలంగాణ వార్తా ప్రతినిధి : మండలంలోని షేక్ పల్లి  గ్రామంలో శుక్రవారం 2వ,అంగన్వాడి కేంద్రంలో పోషణ కార్యక్రమం నిర్వహించారు.మహిళలు,గర్భిణులు,బాలింతలకు ఆరోగ్యం,పరిశుభ్రత,పోషకాహారంపై ఐసీడీఎస్‌ సూపర్వైజర్‌ వెంకటేశ్వరమ్మ అవగాహన కల్పించారు.  కారపాకుల గార్లపాడు వీరాపురం గ్రామాల టీచర్లు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.  ఈ సందర్భంగా సిడిపిఓ హేమలత మాట్లాడుతూ..రక్తహీనత నివారణకు ఆకుకూరలు,కూరగాయలు,పండ్లు,పప్పు దినుసులు,చిరుధాన్యాలు తీసుకోవాలని పేర్కొన్నారు.చిన్నారులకు బాలామృతం,గుడ్లు అందిస్తున్నట్లు ఆమె తెలిపారు.  ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి అంగన్వాడీ టీచర్లు గర్భిణీలు బాలింతలు తదితరులు ఉన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333