పోలీసుల దాడిలో గాయపడ్డ ఆశవర్కర్ ఎస్.కె.రహీంబికి అండగా నిలిచిన
మాజీ ఎమ్మెల్యే డా.గాదరి కిశోర్ కుమార్

అడ్డగూడూరు 13 డిసెంబర్ 2024 తెలంగాణవార్త రిపోర్టర్:- హైదరాబాదులో నిరసన తెలుపుతున్న ఆశ వర్కర్ల వేతనం పెంపు విషయంలో ఈనెల 9వ తేదీన రాష్ట్ర వైద్య ఆరోగ్య కమిషనర్ కు వినతి పత్రం ఇవ్వడానికి వెళ్లిన క్రమంలో హైదరాబాద్ లో పోలీసులు చేసిన దాడిలో గాయపడ్డ మోత్కూర్ పట్టణానికి చెందిన ఎస్.కె రహీంబి అనే ఆశా కార్యకర్తకు గాయపడడంతో ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరామర్శించారు, ఆసుపత్రి వైద్యులు ఎలాంటి ఇబ్బందీ లేదు అని ఇంటికి పంపించారు.తను ఇంటికి చేరుకున్న ఒక్కరోజులోనే మళ్ళీ అనారోగ్యానికి గురికావడంతో నల్లగొండలోని ప్రవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆశవర్కర్ ఎస్.కె.రహీంబిని పరామర్శించిన తుంగతుర్తి మాజీ శాసనసభ్యులు డా"గాదరి కిశోర్ కుమార్ వారికి తక్షణ సహాయంగా 20వేలఆర్థిక సాయం అందజేసి,ఆసుపత్రి ఖర్చులు తనే చెల్లిస్తానని కొండతా భరోసాను కల్పించారు.
మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను కోరారు..వారి వెంట నల్గొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి రాష్ట్ర నాయకులు కంచర్ల కృష్ణ రెడ్డి నాయకులు వున్నారు. ఈ సందర్భంగా తుంగతుర్తి మాజీ శాసనసభ్యులు డా"గాదరి కిశోర్ కుమార్ మాట్లాడుతూ..ఇప్పటికైనా సిగ్గుమాలిన ప్రభుత్వం ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసుకొని వారి విన్నపాలను నెరవేర్చే విధంగా ముందుకుగా వెళ్ళాలి కానీ పోలీసులను అడ్డుపెట్టుకొని పైశాచిక ఆనందం పొందాలనుకుంటే ప్రజలు హర్షించరు మిస్టర్ రేవంత్ రెడ్డి, మానవత్వం లేని రేవంత్ సర్కార్ కు రోజులు దగ్గరపడ్డాయ్..ఆడబిడ్డలను అవమణిస్తూ, దాడులు చేస్తూ ఆశ కార్యకర్తలపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసిన దాడికి తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు..తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఆందోళన చేస్తున్న ఆశా కార్యకర్తల పై పోలీసులు కర్కశంగా వ్యవహరించారు. తెలంగాణ ప్రాంతంలో ఉన్న 25 వేలు మంది ఆశ వర్కర్ల బాధను అర్థం చేసుకొని వాళ్ళ కోరికలను, విన్నపాలను నెరవేర్చ విధంగా అసెంబ్లీలో మాట్లాడాలని రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు.