పేదింటి కుటుంబంలో మరో ఆణిముత్యం డాక్టర్ కమలాకర్

Sep 8, 2026 - 18:38
Sep 8, 2026 - 19:14
 0  2
పేదింటి కుటుంబంలో మరో ఆణిముత్యం డాక్టర్ కమలాకర్

08-09-2026 తెలంగాణ వార్త ప్రతినిధి చిన్నంబావి :  చిన్నంబావి మండల పరిసర ప్రాంతమైన బెఖ్యం గ్రామ నివాసి తెలంగాణ రాష్ట్ర గవర్నర్ చేతుల మీదుగా డాక్టరేట్ పట్టా స్వీకరించిన పోతులపల్లి కమలాకర్.

 పేదింటి కుటుంబంలో జన్మించి ఎన్ని ఆటంకాలు ఎదురైనా లెక్కచేయకుండా పట్టు వదలకుండా డాక్టరేట్ పట్టా పొందడం జరిగింది. 

హైదరాబాద్ ఉస్మానియా విశ్వవిద్యాలయం ఠాగూర్ ఆడిటోరియంలో 2026 సెప్టెంబర్ 8న నిర్వహించిన 85వ స్నాతకోత్సవ కార్యక్రమంలో పోతులపల్లి కమలాకర్ డాక్టరేట్ పట్టాను స్వీకరించారు. తెలంగాణ రాష్ట్ర గవర్నర్, ఉస్మానియా విశ్వవిద్యాలయ ఛాన్సలర్ శ్రీ శివ ప్రతాప్ శుక్లా చేతుల మీదుగా ఆయన డాక్టరేట్ పట్టాను అందుకున్నారు.

కమలాకర్ ఉస్మానియా విశ్వవిద్యాలయం ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ విభాగంలో “High-Efficiency PV Power Management with Fuzzy MPPT and Hybrid-Type Full-Bridge Converter for Dual Grid Integration Using Triple Active Bridge” అనే అంశంపై పరిశోధన చేశారు. సౌర విద్యుత్‌ను అధిక సామర్థ్యంతో వెలికితీసి, అధునాతన పవర్ ఎలక్ట్రానిక్స్ సాంకేతికతల ద్వారా విద్యుత్ నిర్వహణను మెరుగుపరచడంతో పాటు, రెండు గ్రిడ్‌ల అనుసంధానంపై ఈ పరిశోధన నిర్వహించారు.

తన విద్యా ప్రయాణంలో సహకరించిన తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, గురువులు, మిత్రులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

కమలాకర్ డాక్టరేట్ సాధించడం పట్ల కుటుంబ సభ్యులు, బంధువులు, మిత్రులు, బెక్కెం గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు. గ్రామీణ ప్రాంతం నుంచి ఉన్నత విద్యలో రాణించి డాక్టరేట్ సాధించడం యువతకు స్ఫూర్తిదాయకమని వారు పేర్కొన్నారు.

Vishnu Sagar Chinnamabavi Mandal Reporter Wanaparthi District Telangana State