పేదల ఇళ్ళను కూల్చవద్దు

Sep 27, 2024 - 19:00
Sep 28, 2024 - 08:22
 0  122
పేదల ఇళ్ళను కూల్చవద్దు

యాబై ఏళ్ల నుండి నివాసం వుంటున్న నివాస గృహాలు ఎలా కూలుస్తారు

42 వ వార్డు కౌన్సిలర్ అంగిరేకుల రాజశ్రీ నాగార్జున, 30 వ వార్డు కౌన్సిలర్ పల్స మహాలక్ష్మి మల్సూరు, 43 వ వార్డుకు చెందిన కో ఆప్షన్ సభ్యులు బత్తుల జాన్సి రమేష్ లు

అఖిలపక్ష నాయకుల ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద అందోళన చేసిన 42,30, 43 వార్డుల పేదలు

ఎఫ్ టిఎల్, బఫర్ జోన్ పేర్లతో పేదల ఇళ్లు కూల్చవద్దని కోరుతూ అఖిలపక్షం ఆధ్వర్యంలో సూర్యాపేట పట్టణంలోని 42,30,43 వార్డులకు చెందిన పేద ప్రజలు వేలాది మందిగా తరలివచ్చి గురువారం నాడు సూర్యాపేట జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా 42 వ వార్డు కౌన్సిలర్ అంగిరేకుల రాజశ్రీ నాగార్జున, 30 వ వార్డు కౌన్సిలర్ పల్స మహాలక్ష్మి మల్సూర్, 43 వ వార్డుకు చెందిన కో ఆఫ్షన్ సభ్యులు బత్తుల జాన్సి రమేష్ లు మాట్లాడుతూ గత యాబై ఏళ్ల నుండి పేదలు సద్దల చెరువు పక్కన పక్కా ఇళ్లు కట్డుకుని జీవిస్తున్నారని, వారు ఇంటి పన్ను, నల్లా బిల్లులు చెల్లిస్తున్నారని, వారంతా కూలి పని చేసుకుని జీవించే పేదలని అన్నారు. కూలి డబ్బులతో కుటుంబ పోషణ చేస్తూ స్వంత ఇంటి నిర్మాణం చేసుకుని వారి పిల్లల వివాహాలు అదే ఇంటిలో చేసుకుని, మనవళ్లు, మనవరాళ్లతో కలిసి జీవిస్తున్నారని, అటువంటి పేదల ఇళ్ల వద్ద ఎఫ్ టి ఎల్ , బఫర్ జోన్ ల పేరుతో అధికారులు సర్వేలు చేయడంతో పేదలు భయంతో వణికిపోతున్నారని అన్నారు. యాబై ఏళ్ల నుండి జీవిస్తున్న పేదల ఇళ్లు కూల్చవద్దని కోరుతూ అఖిలపక్ష నాయకుల ఆధ్వర్యంలో గురువారం నాడు జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ కు 42,30,43 కు చెందిన కౌన్సిలర్ లు మరియు నాయకులు వినతిపత్రం అందజేసినారు. సద్దల చెరువు పక్కన మూడు ప్రభుత్వ పాఠశాలలు, పార్క్, కమ్యూనిటీ హాల్ , హాస్టల్ భవనాలు వున్నాయని వారు తెలిపారు. 

ఈ కార్యక్రమంలో నాయకులు మీర్ అక్బర్, కట్టు శంకర్, చంచల శేఖర్, గాలి సాయికుమార్ తదితరులు పాల్గొన్నారు.

Shake Jaheer Staff Reporter Suryapet District Telangana 508223