పేదలకు ప్రభుత్వం ఇచ్చిన భూమిని ఎలా లాక్కుంటారు

మండల కార్యదర్శి బుర్రు అనిల్ కుమార్

Apr 22, 2026 - 17:59
Apr 22, 2026 - 18:01
 0  1
పేదలకు ప్రభుత్వం ఇచ్చిన భూమిని ఎలా లాక్కుంటారు

అడ్డగూడూరు 22 ఏప్రిల్ 2026 తెలంగాణవార్త రిపోర్టర్:– భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్టు అడ్డగూడూరు మండల కమిటీ ఆధ్వర్యంలో అడ్డగూడూరు తహశీల్దార్ శేషగిరిరావుకి బుధవారం రోజు వినతిపత్రం అందజేయడం జరిగింది.ఈ సందర్భంగా సీపీఎం అడ్డగూడూరు మండల కార్యదర్శి బుర్రు అనిల్ కుమార్ మాట్లాడుతూ..తెలంగాణ రాష్ట్రంలో ప్రజా పాలన పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ పేద మధ్యతరగతి ప్రజలను ఆసరాగా తీసుకుని వందల ఎకరాల భూములను బలవంతంగా లాకోవడం అన్యాయం అన్ని అన్నారు అడ్డగూడూరు మండల పరిధిలోని డి.రేపక గ్రామంలో ఉన్న 165సర్వే నెంబర్ లో మొత్తం 180 ఎక్కరాలకు 50 ఎకరాలు గంగాదేవి గుడి పరిధిలో ఉన్న గుట్ట 50ఎకరాలు అదే  విధంగా నల్లగుట్ట 50ఎకరాలు ఉంది మిగతా 80ఎకరాలు రైతులు ఎన్నో ఏండ్లుగా పంట పొలాన్ని చేసుకుంటూ ప్రభుత్వ పట్టతో నీళ్లు కోసం భావి తీసుకొని పంటను పండించుకుంటున్నారు. అలాంటి 80ఎకరాలు భూమిని కలెక్టర్ ఆదేశాల మేరకు ఆర్డిఓ, ఎమ్మార్వో,సహకారంతో భూములను బలవంతంగా స్వాధీనం చేసుకుంటున్నారని గ్రామ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని అన్నారు. రెక్కడితే కానీ డొక్కాడని కుటుంబాలు కేవలం అదే భూమిని కొన్ని ఏండ్లుగా నమ్ముకొని వ్యవసాయం చేసుకుంటున్నారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం భూమిని అధికారులు గుంజుకోవడం సరియైన పద్ధతి కాదని అన్నారు. అధికారులు పునరాలోచన చేసి రైతులు సాగుచేసుకుంటున్న సాగు భూమిని రైతులకు ఇవ్వాలని భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్టుగా డిమాండ్ చేస్తుంది.లేని పక్షంలో కమ్యూనిస్టు పార్టీగా ఆందోళన కార్యక్రమాలు చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో రైతులు కర్నాల యాదగిరి, మర్లేనిసోమయ్య, అచ్చయ్య, సోమయ్య, నర్సింహా, లక్ష్మయ్య, మరిలేని ఆనందం, తదితరులు పాల్గొన్నారు.