పేదలకు అన్యాయం చెయ్యాలని చుస్తే ఊరుకునేది లేదు
కాంగ్రెస్ పార్టీ నాయకులు అన్నెపర్తి జ్ఞానసుందర్

మద్దిరాల ఫిబ్రవరి 12తెలంగాణవార్త ప్రతినిధి
మద్దిరాల మండల పరిధిలోని పోలుమల గ్రామానికి చెందిన పాల్వాయి పరిపూర్ణ భర్త పరిషరాములు కులం ఎస్సీ మాదిగ మరియు ఇమ్మడి భాగ్యమ్మ భర్త వీరస్వామి కులము మాదిగ,. వీరీ పూర్వీకులకు గత 40 సంవత్సరాల క్రితం ప్రభుత్వ వారు బ్రతుకుతెరువు నిమిత్తం ప్రభుత్వ భూమి సర్వే నెంబర్ 469 లో ఒక్కొక్కరికి 37 గుంటల చొప్పున భూమి ఇవ్వడం జరిగింది
ఇట్టి భూమిలో పాల్వాయి పరిపూర్ణ భర్త పరశురాములు గారు ఇమ్మడి భాగ్యమ్మ భర్త వీరస్వామి గారు సుమారుగా 20 సంవత్సరాల నుండి ఇట్టి భూమిలో కబ్జాలో ఉండి కాస్తు చేసుకుంటూ జీవిస్తున్నారు.
ఇట్టి భూమిని పట్టా చేయాలనే పాల్వాయి h పరిపూర్ణ గారు ఇమ్మడి భాగ్యమ్మ గారు 2010 సంవత్సరము నుండి ఇప్పటికీ అనేకసార్లు పట్టా చేయాలని దరఖాస్తు ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నారు. కానీ ప్రభుత్వ వారు పట్టా చేయలేదు.
2011 సంవత్సరంలో ప్రభుత్వ సర్వేరు భూమి పరిసరాలను పరిశీలించి సర్వే జరిపి హద్దులను చూపించడం జరిగినది హద్దుల ప్రకారము మేము మా పొలము చుట్టూ రాతి కడిలను పాది ఫెన్సింగ్ ఏర్పాటు చేసుకున్నాం. అదేవిధంగా మా స్వాదీనంలో ఉన్నబడిన భూమి లో బోరు కూడా వేసుకున్నాం అట్టి బోరు నీరు ద్వారా మా పొలంలో పంటను పండించుకొని జీవిస్తున్నారు. వీరి స్వాధీనంలో ఉండబడిన భూమి పైకి దౌర్జన్యంగా తునికి సత్తయ్య గౌడ కుటుఃబాల వారు కామసానిhh సత్తిరెడ్డి కుటుంబాల వారు బలవంతంగా ఆక్రమించడానికి ప్రయత్నం చేశారు మేము వారి ఆక్రమణను అడ్డుకున్నాం.ఈ విషయంలో గ్రామంలో పెద్ద మనషుల సమక్షంలో పంచాయతీ పెట్టగా భవిష్యత్తులో మీ జోలికి రామని అతి భూమి మీదేనని పెద్ద మనసు సమక్షంలో కాగితాలు రాసి ఇవ్వడం జరిగినది.
మరల ఇటీవల కాలంలో మా స్వాధీనంలో ఉండబడిన మా భూమి పైకి మా గ్రామంలోని బీసీలు కొంతమంది ఓసీలు మా పొలం చుట్టూ వేసిన ఫెన్సింగ్ ను ధ్వంసం చేశారు. మా పొలంలో వేసిన వరి పంటను ద్వంసం చేశారు.స్టార్టర్ ను కరెంటు మోటర్ ను కూడా దొంగిలించినారు ఇట్టి విషయంలో మేము పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన పోలీసులు కేసు నమోదు చేయలేదు.hh
ఇదే ప్రభుత్వ భూమి సర్వే నెంబర్ 469 లో భూములు ఉన్న బీసీలకు, ఓసీలకు గత ప్రభుత్వం పది ఎకరాలు పట్టా చేయడం జరిగింది
నిరుపేదలైన మాది కులం చెందిన పాల్వాయి పరిపూర్ణకు ఇమ్మడి భాగ్యమ్మకు పట్టా చేయమని ఎన్నిసార్లు విన్నవించుకున్నా ప్రభుత్వం వారు పట్టా చేయలేదు కేవలం లంచాలు ఇవ్వలేని కారణంగా.
సూర్యాపేట జిల్లా కలెక్టర్ గారు మద్దిరాల మండలంలోని పోలుమల్ల గ్రామం లో ప్రభుత్వg భూమి సర్వే నెంబర్ 469 లో పాల్వాయి పరిపూర్ణ ఇమ్మడి భాగ్యమ్మ ఒక్కొక్కరు 37 గుంటల భూమిలో వారి పూర్వీకుల నుండి నేటి వరకు సుమారు 40 సంవత్సరాల నుండి కబ్జా కలిగి కాస్తు చేసుకుంటూ జీవిస్తున్నారు.
కలెక్టర్ గారు పోలుమల్ల గ్రామంలోని సర్వే నెంబర్ 469 ప్రభుత్వ భూమిలో సమగ్ర విచారణ జరిపి కబ్జాకా కలిగిన పాల్వాయి పరిపూర్ణ ఇమ్మడి భాగ్యమ్మల కు పట్టాలిపించుటకు ప్రభుత్వం వారు ఉత్తర్వులు జారీ చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం