పెళ్లికాని యువకులు మందు కొడితే ₹5 వేల ఫైన్
పట్టిస్తే ₹2 వేల రివార్డ్.
తమిళనాడులోని విలుండమావడి గ్రామంలో మద్యపాన నియంత్రణకు మత్స్యకార సంఘం పెద్దలు వినూత్న నిర్ణయం తీసుకున్నారు.పెళ్లికాని యువకులు మద్యం సేవిస్తూ పట్టుబడితే రూ.5,000 జరిమానా విధించాలని నిర్ణయించారు.అంతేకాకుండా,మద్యం సేవిస్తున్న యువకుల గురించి సమాచారం అందించే వారికి రూ.2,000 నగదు బహుమతి ఇస్తామని ప్రకటించారు.యువత మద్యానికి దూరంగా ఉండేలా చేయడంతో పాటు వారి భవిష్యత్తును కాపాడటం గ్రామంలో ప్రశాంత వాతావరణాన్ని కొనసాగించడమే తమ లక్ష్యమని సంఘం పెద్దలు తెలిపారు.అయితే పెళ్లైన పురుషులకు మద్యం సేవించడంపై నిషేధం విధించలేదు.వారు మద్యం తాగి గొడవలకు పాల్పడితే మాత్రం రూ.5,000 జరిమానా విధిస్తామని హెచ్చరించారు.