పెద్ద చింతరేవులలో అన్నదానం
జోగులాంబ గద్వాల 28 ఫిబ్రవరి 2025 తెలంగాణ వార్తా ప్రతినిధి: ధరూర్. మండల పరిధిలోని పెద్ద చింతరేవుల శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయంలో అమావాస్య సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ చైర్మన్ గిరి రావు అర్చకులు కిష్టా చారి ఆధ్వర్యంలో పవిత్ర కృష్ణా జలాలతో స్వామివారిని అభిషేకాలు పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా దేవాలయానికి వచ్చిన భక్తులకు శ్రీ ఆంజనేయ అన్నదాన ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆలయ అర్చకులు ఆద్య కేశవాచారి అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా కర్ణాటక, తెలంగాణ, ఆంధ్ర తదితర ప్రాంతాల భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం సీనియర్ జర్నలిస్టు ముకుందరావు ఎమ్ఐ టీవీ జర్నలిస్టు విజయ్ భాస్కర్ కు శాలువాతో సన్మానం చేశారు.