పెద్దిరెడ్డి గణేష్ కు తెలంగాణ సారస్వత పరిషత్ ధర్మనిధి సాహితి పురస్కారం

Mar 6, 2026 - 20:12
Mar 6, 2026 - 20:14
 0  6
పెద్దిరెడ్డి గణేష్ కు తెలంగాణ సారస్వత పరిషత్ ధర్మనిధి సాహితి పురస్కారం
పెద్దిరెడ్డి గణేష్ కు తెలంగాణ సారస్వత పరిషత్ ధర్మనిధి సాహితి పురస్కారం

సూర్యాపేట 06 మార్చి 2026 తెలంగాణవార్త ప్రతినిధి:- తెలంగాణ సారస్వత పరిషత్ ప్రతి ఏటా వివిధ రంగాలలో ప్రముఖులకు ప్రధానం చేసే ధర్మనిధి సాహితీ పురస్కారం సూర్యాపేట జిల్లాకు చెందిన ప్రముఖ కవి, రచయిత, సాంస్కృతిక కార్యకర్త పెద్దిరెడ్డి గణేష్ కు ప్రకటించారు. 

తెలంగాణ సాంస్కృతిక వైభవానికి పాటుపడిన ప్రముఖుల పేరు మీద  ఇచ్చే ఈ ధర్మనిధి పురస్కారం. బూర్గుల రంగనాథరావు పేరున పెద్దిరెడ్డి గణేష్ కు ఇస్తున్నట్లు తెలంగాణ సారస్వత పరిషత్ కార్యదర్శి జె. చెన్నయ్య గారు ఒక ప్రకటనలో తెలియజేశారు. ఉగాది పురస్కారాల్లో భాగంగా ఈ పురస్కార ప్రధానం ఈనెల 17 సాయంత్రం పరిషత్ కార్యాలయం హైదరాబాద్ లో, రాష్ట్ర ప్రముఖుల సమక్షంలో అందజేయనున్నట్లు వారు తెలియజేశారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333