పునర్జన్మ ప్రసాదించే ప్రాణాదాతలు

Mar 27, 2026 - 19:52
Mar 27, 2026 - 20:02
 0  0
పునర్జన్మ ప్రసాదించే ప్రాణాదాతలు
పునర్జన్మ ప్రసాదించే ప్రాణాదాతలు

పునర్జన్మ ప్రసాదించే ప్రాణాదాతలు

ములుగు తెలంగాణ వార్త మార్చి 27: ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారిని కంటికి రెప్పలా కాపాడుతూ సరైన సమయంలో ఆస్పత్రికి చేర్చి పునర్జన్మ ప్రసాదించే ప్రాణాదాతలు 108 అంబులెన్స్ సిబ్బందిపై ప్రత్యేక కథనం..

*అడవి బిడ్డలకు అండగా 108 సైరన్..

*వంద ఫోన్లు చేసినా రాని చుట్టాల కంటే.. ఒక్క ఫోన్‌తో ప్రాణాలు కాపాడే 108 సిబ్బందే నిజమైన బంధువులు..

*ఒకే ఒక్క ఫోన్ కాల్ .. వేలాది కుటుంబాలలో వెలుగులు..

*ములుగు గిరిజన ప్రాంతంలో 108 సేవలు అత్యుత్తమం..

*తల్లిబిడ్డల రక్షణతో దేవదూతల్లా 108 సిబ్బంది..

*జిల్లాలో ఏడాది కాలంలో 18886 అత్యవసర కేసులకు స్పందన..

ములుగు జిల్లా అంటేనే దట్టమైన అడవితో కూడిన గిరిజన ప్రాంతం..

ములుగు జిల్లాలో ఎక్కడో అడవిలో ఒక గొత్తికోయాగూడెం.. రాత్రి వేళ.. ఓ గర్భిణీ స్త్రీ పురిటినొప్పులతో అల్లాడుతుండగా ఒకే ఒక్క నెంబర్ కు ఫోన్ కాల్ 108. కొద్ది నిమిషాల్లో సైరన్ మోగిస్తూ చేరుకున్న అంబులెన్స్..పురిటినొప్పులు ఎక్కువ కావడంతో మార్గం మధ్యలోనే ప్రసవం చేసి దేవదూతల్లా తల్లిబిడ్డలను సురక్షితంగా ఆస్పత్రికి తరలించిన 108 సిబ్బంది..

ఇది ఒక్క ఘటన కాదు..

ములుగు జిల్లాలో ప్రతి రోజు ఏదో ఒక బాధతో పునరత పునరావతమవుతున్న సంఘటనలు..

ములుగు జిల్లాలో 2025 మార్చి నుండి 2026 ఫిబ్రవరి వరకు సంవత్సర కాలంలో 18886 కాల్స్ కి స్పందించిన 108 సేవలు, వేలాది కుటుంబాలలో ఆశల దీపం వెలిగించాయి..

ప్రమాదం,ప్రసవవేదన, జ్వరం, పాము కాటు, శ్వాస ఇబ్బంది.. ఏ అత్యవసర పరిస్థితి అయినా మేమున్నాం అని నిలబడుతున్నాయి ఈ ప్రాణ"రథ" చక్రాలు 108 అంబులెన్సులు..

రోడ్డు ప్రమాద కేసులు 1569, గర్భిణీ 2461, సృహా కోల్పోయిన 827, కడుపు నొప్పి 2437, శ్వాసకోశ సంబంధిత 1251, డొమెస్టిక్ ప్రమాదాలు 953, గుండె సంబంధిత, హార్ట్ ఎటాక్ 932, పాయిజన్ (పురుగుల మందు)863, మూర్ఛ (ఫిట్స్) 647, ఆత్మహత్య ప్రయత్నం 368, పెరాలసిస్ 271, జంతు దాడి 445, బర్నింగ్ 46, ఇతర సంబంధిత 5816, సంవత్సర కాలంలో 18886 కేసులకు స్పందించారు,

*ఆపదలో ఆపద్బాంధవులు* 

అక్షరాలా ప్రాణదాతలు108 సిబ్బంది జీవన చిత్రం

ఒక నిశ్శబ్దమైన అర్ధరాత్రి.. వెన్నులో వణుకు పుట్టించే సైరన్ మోత వినిపిస్తుందంటే, అక్కడ ఎవరో ఒకరి ప్రాణం నిలబడబోతోందని అర్థం, ఆ సైరన్ వెనుక ఉండేది కేవలం ఒక వాహనం కాదు, నిరంతరం శ్రమించే 108 ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్స్ (EMT) మరియు పైలట్లు (డ్రైవర్లు)..

ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారికి ఆశాదీపంలా నిలిచే ఈ సిబ్బంది గురించి ఒక ప్రత్యేక కథనం ఇక్కడ ఉంది

108 సిబ్బంది జీవన చిత్రం

ఒక నిశ్శబ్దమైన అర్ధరాత్రి.. వెన్నులో వణుకు పుట్టించే సైరన్ మోత వినిపిస్తుందంటే, అక్కడ ఎవరో ఒకరి ప్రాణం నిలబడబోతోందని అర్థం. ఆ సైరన్ వెనుక ఉండేది కేవలం ఒక వాహనం కాదు, నిరంతరం శ్రమించే 108 ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్స్ (EMT) మరియు పైలట్లు (డ్రైవర్లు..

"మృత్యువుతో పోరాడే 108 సైనికులు"

108 సిబ్బందికి సెలవులు ఉండవు, పండుగలు ఉండవు, ప్రమాదం జరిగిన నిమిషాల్లోనే సంఘటనా స్థలానికి చేరుకోవడం వీరి ప్రాథమిక లక్ష్యం..

"సమయస్ఫూర్తి" గుండెపోటు వచ్చినా, రోడ్డు ప్రమాదం జరిగినా.. ఆసుపత్రికి వెళ్లే లోపు ఇచ్చే 'గోల్డెన్ అవర్' చికిత్స ఎంతో ముఖ్యం. EMTలు ప్రాథమిక చికిత్స అందిస్తుంటే, పైలట్లు ట్రాఫిక్‌ను చీల్చుకుంటూ వేగంగా ఆసుపత్రికి చేరుస్తారు..

"మానవత్వం" ఎంతో మంది గర్భిణీ స్త్రీలకు అంబులెన్స్‌లోనే కాన్పులు చేసిన సందర్భాలు వేలల్లో ఉన్నాయి, కేవలం డ్యూటీగానే కాకుండా, ఒక ప్రాణాన్ని కాపాడాలనే తపన వీరిలో కనిపిస్తుంది..

Files

Alli Prashanth kumar భద్రాద్రి కొత్తగూడెం ములుగు జిల్లా స్టాఫ్ రిపోర్టర్